నాకు నాన్నే గుండు గీశారు | Akshara hasan ready to experiments | Sakshi
Sakshi News home page

నాకు నాన్నే గుండు గీశారు

Mar 10 2017 11:39 PM | Updated on Sep 5 2017 5:44 AM

నాకు నాన్నే గుండు గీశారు

నాకు నాన్నే గుండు గీశారు

‘‘గుండు గీయించుకోవడానికి నేను రెడీ! మరి, దర్శక–నిర్మాతలు రెడీనా?

‘‘గుండు గీయించుకోవడానికి నేను రెడీ! మరి, దర్శక–నిర్మాతలు రెడీనా? నన్ను గుండుతో చూపిస్తారా?’’ అని ప్రశ్నిస్తున్నారు కమల్‌హాసన్‌ చిన్న కూతురు అక్షరా హాసన్‌. ప్రశ్నించడమే కాదండోయ్‌... పక్కా స్క్రిప్ట్‌తో వస్తే గుండు గీయించుకుంటానని స్పష్టం చేశారామె.

సాధారణంగా అమ్మాయిలు గుండు చేయించుకోవడం అరుదు. కొందరు హీరోలు పాత్రలో పర్‌ఫెక్షన్‌ కోసం గుండు గీయించుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ, హీరోయిన్లు అలా చేయడం మహా అరుదు. ఈ నేపథ్యంలో అక్షర వ్యాఖ్యలు తండ్రి కమల్‌హాసన్‌ తరహాలో నేనూ ప్రయోగాలకు సిద్ధమనే సంకేతం అనుకోవాలేమో! అక్షరా హాసన్‌ మాట్లాడుతూ – ‘‘గుండుతో నటించే పాత్రల కోసం నేను ఎదురు చూస్తున్నాను. కానీ, ఇప్పటివరకూ అలాంటి ఛాన్స్‌ రాలేదు. ఒక్కసారి ఛాన్స్‌ ఇచ్చి చూడండి. జుత్తుని త్యాగం చేసేస్తా’’ అన్నారు.

గతంలో ఓసారి గుండు చేయించుకున్నానని ఆమె తెలిపారు. అది చేసింది కూడా ఎవరో కాదు... కమల్‌హాసనే అట! ‘‘చిన్నప్పుడు నా హెయిర్‌ షార్ట్‌గా ఉండేది. ఓసారి క్యాజువల్‌గా నాన్నతో ‘గుండు చేయించుకుంటే ఎలా ఉంటుంది?’ అనడిగా. వెంటనే బాత్‌రూమ్‌లోకి తీసుకువెళ్లి ఆయనే గుండు గీశారు. క్లీన్‌గా నా తలనంతా షేవ్‌ చేశారు. అప్పుడు నా వయసు ఏడేళ్లు. అప్పుడప్పుడూ మేం ఇలాంటి క్రేజీ థింగ్స్‌ చేస్తుంటాం’’ అన్నారు అక్షర.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement