సమంత ప్లేస్‌లో...! | Akshara Haasan opposite Vishal In Pandem Kodi-2 | Sakshi
Sakshi News home page

సమంత ప్లేస్‌లో...!

May 21 2015 10:53 PM | Updated on Sep 3 2017 2:27 AM

సమంత ప్లేస్‌లో...!

సమంత ప్లేస్‌లో...!

అక్క బాటలో చెల్లెలు అన్నట్లుగా.. శ్రుతీ హాసన్‌లానే అక్షరాహాసన్ కూడా హిందీ చిత్రంతోనే నాయికగా పరిచయమయ్యారు.

అక్క బాటలో చెల్లెలు అన్నట్లుగా.. శ్రుతీ హాసన్‌లానే అక్షరాహాసన్ కూడా హిందీ చిత్రంతోనే నాయికగా పరిచయమయ్యారు. అక్షర నటించిన తొలి చిత్రం ‘షమితాబ్’ ఆశించిన ఫలితం సాధించలేదు. జయాప జయాల సంగతెలా ఉన్నా, నటిగా అక్షర మంచి మార్కులే సంపాదించుకున్నారు. ‘షమితాబ్’ తర్వాత ఈ క్యూట్‌గాళ్ వేరే చిత్రాలేవీ అంగీకరించలేదు.
 
  అయితే తాజాగా విశాల్ హీరోగా రూపొందనున్న ‘పందెం కోడి’ సీక్వెల్ ‘పందెం కోడి 2’లో నటించడానికి అంగీకరించారట. ఈ చిత్రంలో ముందు సమంతను తీసుకున్నారనే వార్త ప్రచారమైంది. తాజాగా అక్షర పేరు వినిపిస్తోంది. ఇది ఇలా ఉంటే.. ‘పందెం కోడి’ తొలి భాగంలో నటించిన మీరా జాస్మిన్ ఈ సీక్వెల్‌లో కీలక పాత్ర చేయనున్నారని భోగట్టా.
 

Advertisement
 
Advertisement
Advertisement