లక్కీచాన్సులే..! | Aksha Pardasany Lucky Chance | Sakshi
Sakshi News home page

లక్కీచాన్సులే..!

Oct 13 2015 11:27 PM | Updated on Aug 29 2018 1:59 PM

లక్కీచాన్సులే..! - Sakshi

లక్కీచాన్సులే..!

‘రైడ్’, ‘కందిరీగ’ చిత్రాల్లో కథానాయికగా నటించిన అక్ష లక్కీ చాన్స్ కొట్టేశారు. శ్రీవాస్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం

 ‘రైడ్’, ‘కందిరీగ’ చిత్రాల్లో కథానాయికగా నటించిన అక్ష లక్కీ చాన్స్ కొట్టేశారు.  శ్రీవాస్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న  చిత్రం ‘డిక్టేటర్’లో ఆమె మూడో నాయికగా ఎంపికయ్యారు. అంజలి, సోనాల్‌చౌహాన్ ఇప్పటికే ఇందులో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోస్ ఇంటర్నేషనల్ తో కలిసి వేదాశ్వ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.  శ్రీవాస్ మాట్లాడుతూ-‘‘ పవర్‌ఫుల్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఇందులో బాలకృష్ణ లుక్, స్టయిలిష్‌గా, కొత్తగా ఉంటుంది.  ముగ్గురు కథానాయికల పాత్రలు చిత్రానికి కీలకంగా నిలుస్తాయి’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement