breaking news
Direction srivas
-
అక్కడ ‘డిక్టేటర్’గా అజిత్?
సినిమా విడుదల కావడానికి మరో వారం రోజులు ఉందనగా, పరభాషల నుంచి ఆ సినిమా గురించి ఎంక్వైరీలు మొదలైతే దర్శక-నిర్మాతల ఆనందం మామూలుగా ఉండదు. నందమూరి బాలకృష్ణ నటించిన ‘డిక్టేటర్’ విషయంలో ఇప్పుడు అదే జరిగింది. ఈరోస్ ఇంటర్నేషనల్‌తో కలిసి వేదాశ్వ క్రియేషన్స్ పతాకంపై శ్రీవాస్ దర్శకత్వం వహించి, నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. సినిమా జనాల్లోకి వెళ్లే ముందు.. అందరికన్నా ముందు చూసేవాళ్లల్లో ఎడిటింగ్, రీ-రికార్డింగ్ డిపార్ట్‌మెంట్‌వాళ్లు ఉంటారు. ‘డిక్టేటర్’ చిత్రానికి చిన్నా రీ-రికార్డింగ్ చేశారు. ఆర్.ఆర్. చేసేటప్పుడు చూసిన ఆయన ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తే ఇద్దరు హీరోలకు బాగుంటుందని అనుకున్నారట. సూపర్ స్టార్ రజనీకాంత్, లేటెస్ట్ క్రేజీ స్టార్ అజిత్‌లకు ఈ సినిమా గురించి చెప్పారని సమాచారం. రజనీకాంత్ ఏమన్నారనే విషయం బయటకు రాలేదు కానీ, అజిత్ తాలూకు వ్యక్తులు మాత్రం వెంటనే హైదరాబాద్ విచ్చేసి ‘డిక్టేటర్’ చూశారట. వాళ్లకు నచ్చడంతో తమిళ రీమేక్‌కి అజిత్‌ని దాదాపు ఫిక్స్ చేసేశారని టాక్. -
లక్కీచాన్సులే..!
‘రైడ్’, ‘కందిరీగ’ చిత్రాల్లో కథానాయికగా నటించిన అక్ష లక్కీ చాన్స్ కొట్టేశారు. శ్రీవాస్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం ‘డిక్టేటర్’లో ఆమె మూడో నాయికగా ఎంపికయ్యారు. అంజలి, సోనాల్‌చౌహాన్ ఇప్పటికే ఇందులో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోస్ ఇంటర్నేషనల్ తో కలిసి వేదాశ్వ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శ్రీవాస్ మాట్లాడుతూ-‘‘ పవర్ఫుల్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఇందులో బాలకృష్ణ లుక్, స్టయిలిష్‌గా, కొత్తగా ఉంటుంది. ముగ్గురు కథానాయికల పాత్రలు చిత్రానికి కీలకంగా నిలుస్తాయి’’ అన్నారు.