అక్కడ ‘డిక్టేటర్’గా అజిత్? | Ajith Responded Positively On Dictator! | Sakshi
Sakshi News home page

అక్కడ ‘డిక్టేటర్’గా అజిత్?

Jan 6 2016 11:39 PM | Updated on Sep 3 2017 3:12 PM

అక్కడ ‘డిక్టేటర్’గా అజిత్?

అక్కడ ‘డిక్టేటర్’గా అజిత్?

సినిమా విడుదల కావడానికి మరో వారం రోజులు ఉందనగా, పరభాషల నుంచి ఆ సినిమా

 సినిమా విడుదల కావడానికి మరో వారం రోజులు ఉందనగా, పరభాషల నుంచి ఆ సినిమా గురించి ఎంక్వైరీలు మొదలైతే దర్శక-నిర్మాతల ఆనందం మామూలుగా ఉండదు. నందమూరి బాలకృష్ణ నటించిన ‘డిక్టేటర్’ విషయంలో ఇప్పుడు అదే జరిగింది. ఈరోస్ ఇంటర్నేషనల్‌తో కలిసి వేదాశ్వ క్రియేషన్స్ పతాకంపై శ్రీవాస్ దర్శకత్వం వహించి, నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది.

సినిమా జనాల్లోకి వెళ్లే ముందు.. అందరికన్నా ముందు చూసేవాళ్లల్లో ఎడిటింగ్, రీ-రికార్డింగ్ డిపార్ట్‌మెంట్‌వాళ్లు ఉంటారు. ‘డిక్టేటర్’ చిత్రానికి చిన్నా రీ-రికార్డింగ్ చేశారు. ఆర్.ఆర్. చేసేటప్పుడు చూసిన ఆయన ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తే ఇద్దరు హీరోలకు బాగుంటుందని అనుకున్నారట.

 సూపర్ స్టార్ రజనీకాంత్, లేటెస్ట్ క్రేజీ స్టార్ అజిత్‌లకు ఈ సినిమా గురించి చెప్పారని సమాచారం. రజనీకాంత్ ఏమన్నారనే విషయం బయటకు రాలేదు కానీ, అజిత్ తాలూకు వ్యక్తులు మాత్రం వెంటనే హైదరాబాద్ విచ్చేసి ‘డిక్టేటర్’ చూశారట. వాళ్లకు నచ్చడంతో తమిళ రీమేక్‌కి అజిత్‌ని దాదాపు ఫిక్స్ చేసేశారని టాక్.
 

Advertisement
 
Advertisement
Advertisement