ఈ డాన్‌ ప్రత్యేకం | Akram Movie First Look Launch by Suman | Sakshi
Sakshi News home page

ఈ డాన్‌ ప్రత్యేకం

Mar 1 2019 1:18 AM | Updated on Mar 1 2019 1:18 AM

Akram Movie First Look Launch by Suman - Sakshi

అక్రమ్‌ సురేష్‌

అక్రమ్‌ సురేష్‌ హీరోగా, ఢిల్లీ బ్యూటీ ఖుషీ హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘అక్రమ్‌’. సురేష్‌ మేడిది దర్శకత్వంలో అమరావతి మూవీస్‌ బ్యానర్‌లో రూపొందుతోన్న ఈ మాస్‌ యాక్షన్‌ మూవీ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. అక్రమ్‌ సురేష్‌ పుట్టినరోజు సందర్భంగా ‘రాణా’ పాత్ర లుక్‌ని నటుడు సుమన్‌ లాంచ్‌ చేశారు. సురేష్‌ మేడిది మాట్లాడుతూ– ‘‘డాన్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో రాక్, రాణా, అక్రమ్, రాణా ప్రతాప్‌సింగ్‌ అనే నాలుగు పాత్రల్లో హీరో కనిపిస్తాడు. క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు అందరికీ నచ్చే చిత్రమిది.

మోస్ట్‌ స్టైలిష్‌ యాక్షన్‌ సినిమా. డాన్‌ల సినిమాల్లోనే ప్రత్యేకంగా నిలుస్తుంది.  భారీ సెట్‌లో చిత్రీకరించిన ఇంటర్వెల్‌ సీన్‌ సినిమాకే హైలైట్‌. ఓ షెడ్యూల్, 2 పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో రాక్‌ లుక్‌ని, ఉగాదికి టీజర్‌ని రిలీజ్‌ చేస్తాం. సీనియర్‌ జర్నలిస్ట్‌ తుర్లపాటిగారు అక్కినేనికి ‘నటసామ్రాట్‌’ బిరుదును ఇచ్చారు. ఈ చిత్రంలో అక్రమ్‌ సురేష్‌ గెటప్‌ చూసి ‘టాలీవుడ్‌ తలైవా’ అనే బిరుదును ఇచ్చారు’’ అన్నారు. చిత్ర సమర్పకుడు విస్సా కోటి, శివకుమార్‌ పాల్గొన్నారు. పోసాని కృష్ణమురళి, సుమన్, లిపికా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎం.యు.సాయి, కెమెరా: అనీల్‌.

Advertisement
 
Advertisement
Advertisement