'పట్టుదలతో ఇంగ్లీష్ నేర్చుకున్నారు' | Akkineni Nageswara Rao learned english at late age | Sakshi
Sakshi News home page

'పట్టుదలతో ఇంగ్లీష్ నేర్చుకున్నారు'

Jan 22 2014 9:57 AM | Updated on May 24 2018 12:20 PM

నాలుగో తరగతితోనే చదువుకు ఫుల్ స్టాప్ పెట్టిన అక్కినేని నాగేశ్వరరావు పట్టుదలతో ఆంగ్లం నేర్చుకున్నారు.

హైదరాబాద్:  అక్కినేని నాగేశ్వరరావు నాలుగో తరగతితోనే చదువుకు ఫుల్స్టాప్ పెట్టేశారు. ఆయన యంగ్ హీరోగా రాణిస్తున్న రోజుల్లో చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడుకునేవారు. దాంతో అక్కినేనికి ఇంగ్లీష్ అర్ధమయ్యేది కాదు. ఓ ఆహ్వానం మేరకు ఆయన శ్రీలంక వెళ్లినప్పుడు అందరూ ఇంగ్లీష్లో మాట్లాడితే.. అక్కినేని మాత్రం తమిళంతో మేనేజ్ చేశారు.

ఆ తర్వాత పట్టుదలతో ఆయన ఆంగ్లం నేర్చుకున్నారు. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలిగే స్థాయికి చేరుకున్నారు.  ది హిందూ దినపత్రికను క్రమం తప్పకుండా చదువుతూ ఇంగ్లీష్లో ప్రావీణ్యం సంపాదించారు.  ప్రేక్షకులే దేవుళ్ళు అంటూ కొలిచే ఆయన నటనలో తానెప్పుడూ నిత్యవిద్యార్థినే అని వినయంగా చెబుతుండేవారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement