రెండో మన్మథుడు షురూ

Akkineni nagarjuna Manmadhudu 2 Movie Launch - Sakshi

నాగార్జున హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మన్మథుడు’. కె.విజయ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో 2002లో వచ్చిన ఈ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పదహారేళ్ల తర్వాత నాగ్‌ ‘మన్మథుడు 2’ చేస్తున్నారు. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నాగార్జున అక్కినేని, పి.కిరణ్‌ (జెమిని కిరణ్‌) నిర్మిస్తున్నారు. ఇందులో నాగ్‌కి జోడీగా రకుల్‌ప్రీ™Œ  సింగ్‌ నటిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో నాగచైతన్య కెమెరా స్విచ్చాన్‌ చేయగా, అమల అక్కినేని క్లాప్‌ ఇచ్చారు.

‘‘మన్మథుడు’ సినిమాను స్ఫూర్తిగా తీసుకుని నాగార్జున ఈ సినిమా చేస్తున్నారు. ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌గా రాహుల్‌ రవీంద్రన్‌ ఈ చిత్రాన్ని  తెరకెక్కించనున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ యూరప్‌లో ప్రారంభం కానుంది. ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ చైతన్య భరద్వాజ్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ఎం.సుకుమార్‌ సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. నాగార్జున సోదరి నాగసుశీల, మేనల్లుడు,  హీరో సుశాంత్‌ పాల్గొన్నారు. లక్ష్మి, ‘వెన్నెల’ కిషోర్, రావు రమేష్, నాజర్, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు ఈ చిత్రంలో నటించనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top