అఖిల్ 3 టైటిల్‌ ఇదేనా..? | Akhil Venky Atluri Movie Title | Sakshi
Sakshi News home page

Aug 7 2018 10:58 AM | Updated on Aug 7 2018 10:58 AM

Akhil Venky Atluri Movie Title - Sakshi

అక్కినేని వారసుడిగా వెండితెరకుపరిచయం అయిన యువ కథానాయకుడు అఖిల్‌. తొలి సినిమా అఖిల్‌తో నిరాశపరిచిన ఈ యంగ్ హీరో, రెండో సినిమాగా తెరకెక్కిన ‘హలో’తో పరవాలేదనిపించాడు. అయితే స్టార్ వారసుడిగా ప్రూవ్‌ చేసుకునే స్థాయిలో కమర్షియల్‌ హిట్ మాత్రం సాధించలేకపోయాడు. దీంతో అఖిల్ మూడో సినిమాపై ఆసక్తి నెలకొంది.

తొలిప్రేమ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ మూడో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎక్కువ భాగం విదేశాల్లో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా కు మిస్టర్ మజ్ను అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన మజ్ను అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అదే సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తూ అఖిల్ సినిమాకు మిస్టర్‌ మజ్ను అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement