అఖిల్ పెళ్లికి బ్రేక్..? | Akhil Akkinenis wedding called off | Sakshi
Sakshi News home page

అఖిల్ పెళ్లికి బ్రేక్..?

Feb 22 2017 10:30 AM | Updated on Jul 15 2019 9:21 PM

అఖిల్ పెళ్లికి బ్రేక్..? - Sakshi

అఖిల్ పెళ్లికి బ్రేక్..?

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ పెళ్లి పై ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. గత డిసెంబర్

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ పెళ్లి పై ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. గత డిసెంబర్ ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ జీవీకే మనవరాలితో అఖిల్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ సమ్మర్ లో ఈ ఇద్దరి వివాహాన్ని ఇటలీలో అత్యంత సన్నిహితుల నడుమ నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇప్పటికే ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి. అయితే తాజా సమాచారం ప్రకారం అఖిల్ పెళ్లికి బ్రేక్ పడిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

కారణాలేంటో తెలియకపోయినా.. ఇటలీ వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ లు బుక్ చేసుకున్న వారికి ఇరు కుటుంబాల నుంచి టికెట్స్ క్యాన్సిల్ చేసుకోవాల్సిందిగా సమాచారం అందించారట. టాలీవుడ్ బాలీవుడ్ ప్రముఖలతో పాటు పలువురు ఇండస్ట్రియలిస్ట్ లతో కలిపి దాదాపు 700 మంది ఈ పెళ్లికి హాజరయ్యేందుకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు పెళ్లి కి బ్రేక్ పడిందన్న వార్త ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement