మెగాస్టార్ సినిమా కాదని.. తమిళ్లో చేస్తున్నాడు | Ajith thala 57 villain Vivek Oberoi | Sakshi
Sakshi News home page

మెగాస్టార్ సినిమా కాదని.. తమిళ్లో చేస్తున్నాడు

Oct 20 2016 11:37 AM | Updated on Sep 4 2017 5:48 PM

మెగాస్టార్ సినిమా కాదని.. తమిళ్లో చేస్తున్నాడు

మెగాస్టార్ సినిమా కాదని.. తమిళ్లో చేస్తున్నాడు

బాలీవుడ్ యాక్టర్స్కు హీరో, విలన్ అన్న తేడా ఉండదు. కథలో తమ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటే చాలు ఏ పాత్రకైనా రెడీ అయిపోతారు. అందుకే అమితాబ్, షారూఖ్, ఆమిర్ లాంటి టాప్ స్టార్లు కూడా నెగెటివ్ రోల్స్లో...

బాలీవుడ్ యాక్టర్స్కు  హీరో, విలన్ అన్న తేడా ఉండదు. కథలో తమ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటే చాలు ఏ పాత్రకైనా రెడీ అయిపోతారు. అందుకే అమితాబ్, షారూఖ్, ఆమిర్ లాంటి టాప్ స్టార్లు కూడా నెగెటివ్ రోల్స్లో అలరించారు. తాజాగా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కూడా రోబో సినిమా సీక్వల్ కోసం విలన్గా మారిపోయారు. అదే బాటలో మరో బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్, హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన క్రిష్ 3 సినిమాలో విలన్గా ఆకట్టుకున్నాడు.

దీంతో తెలుగులో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150లో విలన్గా వివేక్ను నటించాల్సిందిగా కోరారు. కానీ అప్పట్లో చిరుకు విలన్గా చేసేందుకు నో చెప్పిన వివేక్ ఇప్పుడు అజిత్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాలో విలన్గా నటించేందుకు అంగకీరించాడట. ఇప్పటికే అజిత్ హీరోగా వరుస సూపర్ హిట్స్ అందించిన శివ మరోసారి తలాతో కలిసి మ్యాజిక్ రిపీట్చేయాలని భావిస్తున్నాడు. ఈ కాంబినేషన్పై ఉన్న నమ్మకంతో పాటు జేమ్స్బాండ్ తరహా సినిమా కావటంతో విలన్ పాత్ర స్టైలిష్గా ఉండబోతోందని వివేక్ ఈ ఆఫర్ను ఓకె చేశాడన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement