
క్రమశిక్షణ గల పోలీస్ అధికారిగా...
అజిత్, మీరా జాస్మిన్ జంటగా తమిళంలో రూపొందిన ‘ఆంజనేయ’ చిత్రాన్ని ‘నే వస్తున్నా’ పేరుతో ఎస్. మురళీనాథన్ తెలుగులోకి విడుదల చేస్తున్నారు.
అజిత్, మీరా జాస్మిన్ జంటగా తమిళంలో రూపొందిన ‘ఆంజనేయ’ చిత్రాన్ని ‘నే వస్తున్నా’ పేరుతో ఎస్. మురళీనాథన్ తెలుగులోకి విడుదల చేస్తున్నారు. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. మణిశర్మ స్వరపరచిన పాటలను ఈ నెల రెండో వారంలో విడుదల చేయాలనుకుంటున్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఇందులో క్రమశిక్షణ గల పోలీస్ అధికారిగా అజిత్ నటించారు. మీరా జాస్మిన్‌ది కూడా నటనకు అవకాశం ఉన్న పాత్ర. కథానుసారం ఇందులో పదకొండు ఫైట్స్ ఉన్నాయి. దాదాపు అన్నీ రిస్కీ ఫైట్సే. వీటిని అజిత్ డూప్ లేకుండా చేశారు. ఈ సినిమా అన్ని వర్గాలవారిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: శ్రీరామ్ .వై, సహనిర్మాత: పరిటాల రాంబాబు.