అజిత్ హీరోగా హ్యాట్రిక్ సినిమా | Ajith hatrick movie with veeram director siva | Sakshi
Sakshi News home page

అజిత్ హీరోగా హ్యాట్రిక్ సినిమా

Nov 14 2015 10:01 AM | Updated on Sep 3 2017 12:29 PM

అజిత్ హీరోగా హ్యాట్రిక్ సినిమా

అజిత్ హీరోగా హ్యాట్రిక్ సినిమా

తెలుగు సినిమా శౌర్యంతో దర్శకుడిగా పరిచయం అయి తరువాత కోలీవుడ్ స్టార్ స్టేటస్ అందుకున్న దర్శకుడు శివ. సినిమాటోగ్రఫి నుంచి దర్శకత్వం శాఖలోకి వచ్చిన ఈ డైరెక్టర్ తమిళనాట వరుస...

తెలుగు సినిమా 'శౌర్యం'తో దర్శకుడిగా పరిచయం అయి, తర్వాత కోలీవుడ్ స్టార్ స్టేటస్ అందుకున్న దర్శకుడు శివ. సినిమాటోగ్రఫీ నుంచి దర్శకత్వం శాఖలోకి వచ్చిన ఈ డైరెక్టర్ తమిళనాట వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఓ కోలీవుడ్‌లో అజిత్ హీరోగా ఓ సూపర్ హిట్ సినిమాను అందించిన శివ అదే హీరోతో మరో సినిమాకు కమిట్ అయ్యాడు.

శివ, అజిత్‌ల కాంభినేషన్ లో రూపొందిన తొలి సినిమా వీరం. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో అదే దర్శకుడితో వేదలం సినిమాను చేశాడు అజిత్. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించటంతో ఇప్పుడు అదే కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాకు రెడీ అవుతున్నారు.

ప్రస్తుతం మోకాలికి శస్త్రచికిత్స చేయించుకొని రెస్ట్ తీసుకుంటున్న అజిత్ రెండు నెలల పాటు షూటింగులకు దూరంగా ఉంటున్నాడు. దీంతో అజిత్, శివల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూడో సినిమాను సంక్రాంతికి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే వీరం, ఎన్నై అరిందాల్, వేదలం సినిమాలతో హ్యాట్రిక్ సక్సెస్ లు సాధించిన అజిత్ మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement