ఐసీయూలో హీరో తల్లి.. షూటింగ్‌ రద్దు | Ajay Devgn cuts short shoot as mom rushed to ICU | Sakshi
Sakshi News home page

ఐసీయూలో హీరో తల్లి.. షూటింగ్‌ రద్దు

Jan 24 2017 5:38 PM | Updated on Sep 5 2017 2:01 AM

ఐసీయూలో హీరో తల్లి.. షూటింగ్‌ రద్దు

ఐసీయూలో హీరో తల్లి.. షూటింగ్‌ రద్దు

బాలీవుడ్‌ హీరో అజయ్ దేవగణ్‌ తల్లి వీణా ఆరోగ్యం విషమించడంతో అతను షూటింగ్ను రద్దు చేసుకున్నాడు.

ముంబై: బాలీవుడ్‌ హీరో అజయ్ దేవగణ్‌ తల్లి వీణా ఆరోగ్యం విషమించడంతో అతను షూటింగ్ను రద్దు చేసుకున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ బాద్షాహో షూటింగ్లో పాల్గొనేందుకు అజయ్ గత శుక్రవారం రాజస్థాన్లోని జోధ్పూర్కు వెళ్లాడు. కాగా శనివారం అతని తల్లి ఆరోగ్యం బాగాలేదని తెలియడంతో నిర్మాతల అనుమతి తీసుకుని ముంబైకి తిరిగి వచ్చాడు.

వారం రోజులుగా వీణా ఛాతీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఊపరితిత్తుల్లోకి నీరు చేరడంతో శనివారం ఆమెను ముంబైలోని శాంటా క్రజ్ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. రెండురోజులుగా అజయ్ తన తల్లి వద్ద ఆస్పత్రిలోనే ఉంటున్నాడు. ఆమె ఆరోగ్యం కుదుటపడిన తర్వాత అజయ్ మళ్లీ షూటింగ్లో పాల్గొంటాడు. ఇంతకుముందు కూడా వీణాను అనారోగ్య సమస‍్యల వల్ల ఆస్పత్రిలో చేర్చారు. ఆమె డిశ్చార్జి అయిన తర్వాతే అజయ్ జోధ్పూర్కు వెళ్లాడు. ఇంతలోనే ఆమె అరోగ్యం విషమించడంతో మళ్లీ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement