అతిథి పాత్రలో అజయ్ దేవ్గన్ | Ajay Devgan guest appearence Katrina Kaifs Fitoor | Sakshi
Sakshi News home page

అతిథి పాత్రలో అజయ్ దేవ్గన్

Feb 11 2016 2:22 PM | Updated on Apr 4 2019 5:42 PM

అతిథి పాత్రలో అజయ్ దేవ్గన్ - Sakshi

అతిథి పాత్రలో అజయ్ దేవ్గన్

ఈ శుక్రవారం రిలీజ్కు రెడీ అవుతున్న బాలీవుడ్ రొమాంటిక్ డ్రామా ఫితూర్కు సంబందించి ఆసక్తికరమైన వార్త బాలీవుడ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. ఆదిత్యరాయ్ కపూర్, కత్రినా కైఫ్, టబు లీడ్ రోల్స్లో...

ఈ శుక్రవారం రిలీజ్కు రెడీ అవుతున్న బాలీవుడ్ రొమాంటిక్ డ్రామా ఫితూర్కు సంబందించి ఆసక్తికరమైన వార్త బాలీవుడ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. ఆదిత్యరాయ్ కపూర్, కత్రినా కైఫ్, టబు లీడ్ రోల్స్లో నటించిన ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ హీరో అతిధి పాత్రలో దర్శనమివ్వనున్నాడట. ఇప్పటి వరకు ఆ విషయాన్ని సీక్రెట్గా ఉంచిన చిత్రయూనిట్ సినిమా ప్రమోషన్లో భాగంగా రివీల్ చేసింది.

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ ఫితూర్ గెస్ట్ రోల్లో నటించాడు. సినిమాకు ఎంతో కీలకమైన సన్నివేశం కోసం స్టార్ ఇమేజ్ ఉన్న నటుడైతే కరెక్ట్ అని భావించిన దర్శకుడు అభిషేక్ కపూర్, అజయ్ను సంప్రదించాడు. ఆదిత్య రాయ్ కపూర్, అజయ్ దేవ్గన్ల మధ్యే వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్గా నిలుస్తాయంటున్నారు చిత్రయూనిట్. చార్లెస్ డికెన్స్ రాసిన గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ నవల ఆధారంగా తెరకెక్కిన ఫితూర్ సినిమా ఫిబ్రవరి 12న ఆడియన్స్ ముందుకు వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement