వన్‌ మోర్‌ చాన్స్‌ | Aiyaary actor Rakul Preet to romance Ajay Devgn in her next | Sakshi
Sakshi News home page

వన్‌ మోర్‌ చాన్స్‌

Jan 17 2018 12:30 AM | Updated on Jul 23 2019 11:50 AM

Aiyaary actor Rakul Preet to romance Ajay Devgn in her next - Sakshi

... కొట్టేశారు హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌. నీరజ్‌ పాండే దర్శకత్వంలో ఆమె నటించిన ‘అయ్యారీ’ సినిమా రిలీజ్‌ కాకముందే మరో హిందీ సినిమాకు సైన్‌ చేశారు. అకివ్‌ అలీ దర్శకత్వంలో అజయ్‌ దేవగన్‌ హీరోగా భూషణ్‌ కుమార్, రంజన్‌ నిర్మిస్తున్న సినిమాలో రకుల్‌ను హీరోయిన్‌గా సెలెక్ట్‌ చేసుకున్నారు నిర్మాతలు.

‘‘రకుల్‌ హిందీలో నటించిన తొలి చిత్రం ‘యారియాన్‌’కి నేనో నిర్మాతను. ఇప్పుడు మళ్లీ మా అసోసియేషన్‌ కుదరడం ఆనందంగా ఉంది. సౌత్‌లో మంచి యాక్టర్‌గా రకుల్‌కు పేరు తెచ్చుకుంది’’ అన్నారు భూషణ్‌కుమార్‌. ఈ సినిమాలో టబు ఓ కీలక పాత్ర చేయనున్నారు. త్వరలో ఈ చిత్రం షూటింగ్‌ ఆరంభించి అక్టోబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఒకవైపు తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉంటూ మరోవైపు హిందీ సినిమాలకూ డేట్స్‌ ఇస్తూ.. రకుల్‌ జోరు మీద ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement