ఐశ్వర్య ధనుష్, రెహ్మాన్ కాంబినేషన్‌లో సినిమావీరన్ | Aishwarya to collaborate with AR Rahman | Sakshi
Sakshi News home page

ఐశ్వర్య ధనుష్, రెహ్మాన్ కాంబినేషన్‌లో సినిమావీరన్

Feb 26 2016 2:40 AM | Updated on Sep 3 2017 6:25 PM

ఐశ్వర్య ధనుష్, రెహ్మాన్ కాంబినేషన్‌లో సినిమావీరన్

ఐశ్వర్య ధనుష్, రెహ్మాన్ కాంబినేషన్‌లో సినిమావీరన్

ఐశ్వర్య ఆర్.ధనుష్, ఏఆర్.రెహ్మాన్‌ల అరుదైన కాంబినేషన్‌లో చిత్రం తెరకెక్కనుందన్నది తాజా సమాచారం.

 ఐశ్వర్య ఆర్.ధనుష్, ఏఆర్.రెహ్మాన్‌ల అరుదైన కాంబినేషన్‌లో చిత్రం తెరకెక్కనుందన్నది తాజా సమాచారం. నటుడు ధనుష్ అర్ధాంగి, సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్దకూతురు ఐశర్య ఆర్.ధనుష్ 3 చిత్రం ద్వారా మెగాఫోన్ పట్టిన విషయం తెలిసిందే. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా అందులోని వై దిస్ కొలెవైరి డీ పాట అనూహ్యంగా దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది.
 
 అందుకు ప్రధాన కారణం ఆ చిత్రంలో సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టిన అనిరుద్‌నే అని చెప్పక తప్పదు. ఈయన ఐశ్వర్య కుటుంబానికి దగ్గర బంధువు అన్నది గమనార్హం. ఐశ్వర్య ఆర్.ధనుష్ తరుపరి చిత్రం వై రాజా వై కి అనిరుద్‌నే సంగీతం అందించారు. ఆ చిత్రం కమర్షియల్‌గా హిట్ అయ్యింది. ఐశ్వర్య ఆర్.ధనుష్ కొత్త చిత్రానికి రెడీ అయ్యారని సమాచారం. దీనికి సినిమావీరన్  అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తెలి
 సింది. ఇది సినీ  స్టంట్ కళాకారుడి
 
 ఇతివృత్తంతో తెరకెక్కించనున్న చిత్రం అని సమాచారం. చిత్రాల్లో హీరోలు పలు వీరోచిత సాహసాలు చేసి అభిమానులను అలరిస్తుంటారు. అయితే ఆ సాహసాల వెనుక స్టంట్ కళాకారుల జీవన్మరణ పోరాటాలు ఉంటాయి. వాటిని ఆవిష్కరించే చిత్రంగా సినామా వీరన్ ఉంటుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇందులో నటించే నటీనటుల ఎంపిక జరుగుతోందని తెలిసింది.
 
 ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక పూర్వ ప్రకటన త్వరలో వెలువడనున్నట్లు టాక్. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించనున్నారని కోడంబాక్కమ్ టాక్. ఇప్పటికే బీప్ సాంగ్ వ్యవహారం తరువాత నటుడు ధనుష్ అనిరుద్‌ను పక్కన పెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఐశ్వర్య ఆర్.ధనుష్, ఏఆర్.రెహ్మాన్ కాంబినేషన్‌లో చిత్రం అంటే  ఆ ప్రచారానికి మరింత బలం చేకూరుతుందన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement