అతిథి పాత్రలో ఐశ్వర్య? | aishwarya ray guest role in 2.0 | Sakshi
Sakshi News home page

అతిథి పాత్రలో ఐశ్వర్య?

Sep 30 2018 5:38 AM | Updated on Sep 12 2019 10:40 AM

aishwarya ray guest role in 2.0 - Sakshi

రజనీకాంత్, ఐశ్వర్యా రాయ్‌

‘ఎందిరిన్‌’ సినిమాలో చిట్టి (రోబో) ఐశ్వర్యా రాయ్‌ని గాఢంగా ప్రేమించాడు. ఇప్పుడు ‘2.0’ సినిమా కోసం మళ్లీ చిట్టి వస్తున్నాడు. పనిలో పనిగా తన గార్ల్‌ఫ్రెండ్‌ని కూడా చూసుకునే అవకాశం చిట్టికి ఉందట. అదేనండీ.. ‘2.0’ సినిమాలో ఐశ్వర్యా రాయ్‌ కూడా ఓ గెస్ట్‌ రోల్‌లో కనిపించబోతున్నారని చెబుతున్నాం. శంకర్‌ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్‌కుమార్, అమీ జాక్సన్‌ ముఖ్యతారలుగా నటించిన సినిమా ‘2.0’. 2010లో వచ్చిన ‘ఎందిరిన్‌’ (తెలుగులో ‘రోబో’) సినిమాకు ఇది సీక్వెల్‌ అన్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో తొలి పార్ట్‌లో హీరోయిన్‌గా నటించిన ఐశ్వర్యా రాయ్‌ సీక్వెల్‌లో ఓ గెస్ట్‌ రోల్‌ చేశారని తాజా కోలీవుడ్‌ టాక్‌. ఆ సంగతలా ఉంచితే.. ఇటీవల విడుదల చేసిన టీజర్‌లో అక్షయ్‌ కుమార్‌కు స్క్రీన్‌ స్పేస్‌ తక్కువగా ఉందని ఆయన ఫ్యాన్స్‌ ఫీలయ్యారట. అందుకే  అక్షయ్‌ కుమార్‌కు సంబంధించిన ఓ చిన్న టీజర్‌ను రిలీజ్‌ చేయాలని దర్శక–నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారని వినికిడి. ఇలా చేస్తే నార్త్‌లో కూడా ‘2.0’ సినిమాకు మంచి పబ్లిసిటీ వచ్చే అవకాశం కూడా ఉందనే ఆలోచనలో ఉన్నారట. దాదాపు 500 కోట్లతో లైకాప్రొడక్షన్స్‌ నిర్మించిన ‘2.0’ సినిమా ఈ ఏడాది నవంబర్‌ 29న విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement