మణి చిత్రంలో ఐష్ లేనట్టే | Aishwarya Rai Bachchan not in Mani Ratnam's next | Sakshi
Sakshi News home page

మణి చిత్రంలో ఐష్ లేనట్టే

Jul 18 2015 3:53 PM | Updated on Sep 3 2017 5:45 AM

మణి చిత్రంలో ఐష్ లేనట్టే

మణి చిత్రంలో ఐష్ లేనట్టే

ప్రముఖ దర్శకుడు మణిరత్నం తదుపరి చిత్రంలో ఐశ్వర్యరాయ్ బచ్చన్ నటించడం లేదు.

చెన్నై: ప్రముఖ దర్శకుడు మణిరత్నం తదుపరి చిత్రంలో ఐశ్వర్యరాయ్ బచ్చన్ నటించడం లేదు. మణి దర్శకత్వంలో కార్తీ, దుల్కర్ స‌ల్మాన్ ప్రధాన పాత్రలోనటించనున్న తమిళ చిత్రంలో ఐశ్వర్యరాయ్ నటిస్తుందన్న వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు మణిరత్నం తదుపరి చిత్రంలో హీరోయిన్లను ఇంకా ఎంపిక చేయలేదని, ఆ చిత్రంలో ఐశ్వర్యరాయ్ నటిస్తుందన్న పుకార్లలో వాస్తవం లేదని చిత్ర యూనిట్ సభ్యులు ఒకరు తెలిపారు.

సెప్టెంబర్లోనే షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ రాజీవ్ రవి దర్శకత్వం వహిస్తున్నమళయాళ చిత్రంలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడు. దీంతో ఈ చిత్ర షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభం కానుందని చెప్పారు. ఐశ్వర్యారాయ్, మణిరత్నం దర్శకత్వం వహించిన ఇరువార్(ఇద్దరు), గురు, రావన్(విలన్) చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement