మళ్లీ జులాయి కాంబినేషన్! | again julayi combination | Sakshi
Sakshi News home page

మళ్లీ జులాయి కాంబినేషన్!

Apr 11 2014 1:38 AM | Updated on Sep 2 2017 5:51 AM

మళ్లీ జులాయి కాంబినేషన్!

మళ్లీ జులాయి కాంబినేషన్!

అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే... ‘జులాయి’ సినిమా గుర్తొస్తుంది. రెండేళ్ల క్రితం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా చేసిన సందడి అంతా ఇంతా కాదు.

అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే... ‘జులాయి’ సినిమా గుర్తొస్తుంది. రెండేళ్ల క్రితం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా చేసిన సందడి అంతా ఇంతా కాదు. తొలి కలయికలోనే యువతరం హృదయాలను కొల్లగొట్టేశారు బన్నీ, త్రివిక్రమ్. వీరిద్దరి కాంబినేషన్‌లో మొదలయ్యే తదుపరి చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. వారి ఆకాంక్షను నిజం చేస్తూ వీరి సినిమా గురువారం హైదరాబాద్‌లో వైభవంగా మొదలైంది.
 
‘జులాయి’ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎస్.రాధాకృష్ణ(చినబాబు)  ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి అల్లు అర్జున్ క్లాప్ ఇచ్చారు. పలువురు చిత్రరంగ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. బన్నీకి జోడీగా తొలిసారి సమంత నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నారు.
 
మేలో ఈ చిత్రం సెట్స్‌కి వెళ్లనుంది. ‘జులాయి’ని మించే స్థాయిలో ఇందులో త్రివిక్రమ్ పంచ్ డైలాగులు ఉంటాయని, ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, కూర్పు: ప్రవీణ్ పూడి, కళ: రవీందర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పి.డి.ప్రసాద్,  నిర్మాణం: హారిక అండ్ హాసిని క్రియేషన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement