మళ్లీ మళ్లీ ఇది రాని రోజు | 'After DDLJ, I could quote any price | Sakshi
Sakshi News home page

మళ్లీ మళ్లీ ఇది రాని రోజు

Dec 11 2014 12:21 AM | Updated on Sep 2 2017 5:57 PM

మళ్లీ మళ్లీ ఇది రాని రోజు

మళ్లీ మళ్లీ ఇది రాని రోజు

షారుఖ్ ఖాన్, కాజోల్ జంటగా నటించిన సూపర్‌హిట్ చిత్రం ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ విడుదలైన ఇప్పటికి దాదాపు 20 ఏళ్ళవుతోంది.

షారుఖ్ ఖాన్, కాజోల్ జంటగా నటించిన సూపర్‌హిట్ చిత్రం ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ విడుదలైన ఇప్పటికి దాదాపు 20 ఏళ్ళవుతోంది. ఈ వారంలో ముంబయ్‌లోని ‘మరాఠా మందిర్’ హాలులో ఈ చిత్రం వెయ్యి వారాల ప్రదర్శన పూర్తి చేసుకోనుంది. మొదట్లో రోజు 4 ఆటలు ప్రదర్శించి, ఆ తరువాత కేవలం ఉదయం ఆటలకు పరిమితమైన ఈ సినిమాను తక్కువ టికెట్ రేట్లకు ప్రదర్శిస్తుండడం విశేషం. కాగా, ఈ వెయ్యి వారాల రికార్డు పండుగ సందర్భంగా యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఓ ప్రత్యేక కార్యక్రమం, విందు ఏర్పాటు చేస్తోంది. హీరో హీరోయిన్లు ఈ చిత్ర నిర్మాణ విశేషాల గురించి వేదికపై సుదీర్ఘంగా మాట్లాడనున్నారు. ఈ చిత్రానికి తమకు అవకాశమెలా వచ్చిందన్న దగ్గర నుంచి నిర్మాణ సమయంలో జరిగిన ఆసక్తికర సంఘటనల లాంటివన్నీ ఆ రోజు ఈ జంట పంచుకోనుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement