టాలీవుడ్ జేమ్స్‌ బాండ్‌ : గూఢచారి

Adivi Sesh Goodachari Movie Trailer - Sakshi

క్షణం, అమీ తుమీ సినిమాలతో ఆకట్టుకున్న అడివి శేష్ ఓ స్పై థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తెలుగు తెర మీద అరుదుగా కనిపించే బాండ్‌ తరహా సినిమాతో రెడీ అవుతున్నాడు శేష్‌. గూఢచారి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఆ అంచనాలను  మరింత పెంచేస్తూ ఇంట్రస్టింగ్‌ టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌.

స్టైలిష్‌ గా ఉన్న శేష్‌ లుక్కు ఆకట్టుకుంది. స్పై థ్రిల్లర్‌గా తెరెకెక్కుతున్న ఈ సినిమాకు శశికిరణ్‌ టీ దర్శకుడు. ఈ చిత్రంలో 2013లో మిస్ ఇండియా ఎర్త్ శోభితా ధూళిపాళ్ల హీరోయిన్‌ గా నటిస్తోంది. చాలా కాలం తరువాత  నాగార్జున మేనకోడలు సుప్రియ(అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి చిత్ర హీరోయిన్‌) ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు.. ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్‌ పిక్చర్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఆగస్ట్‌ 3న రిలీజ్‌  కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top