శేష్‌ ఎవరు?

Adivi Sesh Evaru Movie Title Poster - Sakshi

అడివి శేష్, పీవీపీ కాంబినేషన్‌లో వచ్చిన ‘క్షణం’ సినిమా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో మరో చిత్రం రూపొందుతోంది. ఆ చిత్రానికి ‘ఎవరు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వెంకట్‌ రామ్‌జీ దర్శకత్వంలో పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి. పొట్లూరి, కెవిన్‌ అన్నె నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ చిత్రంలో శేష్‌కి జోడీగా రెజీనా నటిస్తుండగా, నవీన్‌ చంద్ర ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ‘‘థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. ఆగస్ట్‌ 23న సినిమాని రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: వంశీ పచ్చిపులుసు, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top