నేనే కాదు.. వ్యభిచారంలో చాలామంది హీరోయిన్లు: శ్వేతాబసు | Actress took to prostitution after running out of money | Sakshi
Sakshi News home page

నేనే కాదు.. వ్యభిచారంలో చాలామంది హీరోయిన్లు: శ్వేతాబసు

Sep 3 2014 7:22 PM | Updated on Aug 28 2018 4:30 PM

నేనే కాదు.. వ్యభిచారంలో చాలామంది హీరోయిన్లు: శ్వేతాబసు - Sakshi

నేనే కాదు.. వ్యభిచారంలో చాలామంది హీరోయిన్లు: శ్వేతాబసు

సినిమా అవకాశాలు రాక డబ్బులు లేకపోవడం, కుటుంబాన్ని ఆదుకునేందుకు మరో మార్గం లేకపోవడంతో వ్యభిచార వృత్తిలోకి దిగానని టాలీవుడ్ నటి శ్వేత బసు ప్రసాద్ చెప్పింది.

హైదరాబాద్: సినిమా అవకాశాలు రాక డబ్బులు లేకపోవడం, కుటుంబాన్ని ఆదుకునేందుకు మరో మార్గం లేకపోవడంతో వ్యభిచార వృత్తిలోకి దిగానని టాలీవుడ్ నటి శ్వేతా బసు ప్రసాద్ చెప్పింది. తానొక్కదాన్నే కాదని, ఇంకా చాలామంది హీరోయిన్లు ఇలాగే వ్యభిచారంలో ఉన్నారని ఆమె వెల్లడించింది. అయితే వాళ్ల పేర్లు మాత్రం ఆమె చెప్పలేదు. కాగా తన కెరీర్లో తప్పుడు మార్గం ఎన్నుకున్నానని అంగీకరించింది. వ్యభిచారం కేసులో ఆదివారం అరెస్టయిన శ్వేతను రెస్క్యూ హోంకు తరలించిన సంగతి తెలిసిందే. ఒకప్పడు జాతీయ అవార్డు అందుకున్న శ్వేత తన జీవితంలో ఎదురైన సంఘటనల గురించి పోలీసులకు వివరించింది. ఓ జాతీయ వార్త సంస్థ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

'చేతిలో డబ్బులు అయిపోయాయి. కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. అయితే డబ్బులు సంపాదించడానికి ఏ మార్గం కనిపించిలేదు. నిస్సాహాయ స్థితిలో ఉన్ననేను తప్పనిసరి పరిస్థితుల్లో కొందరి ప్రోత్సాహంతో వ్యభిచార వృత్తిలోకి దిగా' అని శ్వేత చెప్పింది. తనలాగే మరికొందరు నటులు కూడా ఇదే మార్గాన్ని ఎంచుకున్నారని తెలిపింది. శ్వేత మూడు నెలల పాటు రెస్క్యూ హోంలో ఉండే అవకాశముంది.

Advertisement
 
Advertisement
Advertisement