బాలీవుడ్ తార శిల్పాశెట్టి నేత్రదానం! | Actress Shilpa Shetty donates eyes | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ తార శిల్పాశెట్టి నేత్రదానం!

Jun 6 2014 9:29 PM | Updated on Sep 2 2017 8:24 AM

బాలీవుడ్ తార శిల్పాశెట్టి నేత్రదానం!

బాలీవుడ్ తార శిల్పాశెట్టి నేత్రదానం!

అన్ని దానాల్లో నేత్రదానం గొప్పదని బాలీవుడ్ తార శిల్పాశెట్టి తెలియ చెప్పారు.

అన్ని దానాల్లో నేత్రదానం గొప్పదని బాలీవుడ్ తార శిల్పాశెట్టి తెలియ చెప్పారు. తాజాగా శిల్పాశెట్టి నేత్రదానం చేసి అందరికి ఆదర్శంగా నిలిచారు. యశ్వంత్ సమాజిక్ ప్రతిస్థాన్ సామాజిక సంస్థకు తన నేత్రాలను శిల్పాశెట్టి దానం చేశారు. 
 
తన భర్త రాజ్ కుంద్రాతో కలిసి షిర్డీలో సాయిబాబాను దర్శించుకున్న తర్వాత ఆహ్వద్ నగర్ లోని సోనాయ్ గ్రామంలోని శని శింగనపూర్ ఆలయంలో శిల్పాశెట్టి పూజలు నిర్వహించారు. నా మరణం తర్వాత నా కళ్ల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. 
 
మరొకరి దృష్టిని ప్రసాదిస్తుందనే విషయం తనకు సంతృప్తిని కలిగిస్తోందని శిల్పాశెట్టి అన్నారు. ఐపీఎల్ తన జట్టు రాజస్థాన్ రాయల్స్ ఐదవ స్థానంలో నిలవడాన్ని ఎప్పుడో మరిచిపోయాను.. ఓటమిని ఎక్కువగా గుర్తుంచుకోనని ఆమె అన్నారు. 
 
ఓటముల నుంచి తన జట్టు పాఠాలు నేర్చుకుంటుందన్నారు. శిల్ప సోదరి షమితా శెట్టి కూడా తన నేత్రాలను దానం చేయడం విశేషం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement