సోషల్ మీడియాలో నటి వీడియో వైరల్! | actress Shanvi Srivastava video trending in social media | Sakshi
Sakshi News home page

సోషల్ మీడియాలో నటి వీడియో వైరల్!

Feb 9 2018 7:00 PM | Updated on Oct 22 2018 6:05 PM

actress Shanvi Srivastava video trending in social media - Sakshi

నటి శాన్వీ శ్రీవాత్సవ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటో

హార్డ్ వర్క్ చేయడమంటే చాలా ఫన్నీగా ఉంటుందట. ఈ విషయాన్ని నటి శాన్వీ శ్రీవాత్సవ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె వర్కవుట్లు చేసిన వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా వైరల్ అవుతోంది. ఆ వీడియో చూశాక ఎంతో మంది వర్కవుట్ చేయడం మొదలుపెడతారని ఆమె చెబుతోంది. వీడియో చూసినవాళ్లు తమ ఆరోగ్యం కోసం, ఫిట్‌గా ఉండేందుకు శారీరక శ్రమ చేస్తారని ట్వీట్లో రాసుకొచ్చింది నటి శాన్వీ. ఆమె పోస్ట్ చేసిన వీడియోకు విశేష స్పందన వస్తోంది.
 
నటి శాన్వీ.. లవ్‌లీ, అడ్డా, రౌడీ, ప్యార్‌ మే పడిపోయానే వంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా అలరించారు. తెలుగులో అవకాశాలు లేవు కానీ, కన్నడలో మాత్రం ఫుల్ బిజీ హీరోయిన్ ఈమె. డైరెక్టర్ అయ్యేందుకు రెండు కథలను శాన్వీ సిద్ధం చేసుకున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. అయితే సినిమాలో శాన్వీ డైరెక్టర్‌గా కనిపించనుందని నటిగానే కొనసాగనుందని మూవీ యూనిట్ క్లారిటీ ఇచ్చింది.
 

Advertisement
 
Advertisement
Advertisement