కమెడియన్‌తో లేడీ సూపర్‌స్టార్‌? | actress nayanthara and comedian soori pair in next new comedy | Sakshi
Sakshi News home page

కమెడియన్‌తో లేడీ సూపర్‌స్టార్‌?

Mar 23 2017 9:31 AM | Updated on Sep 5 2017 6:54 AM

కమెడియన్‌తో లేడీ సూపర్‌స్టార్‌?

కమెడియన్‌తో లేడీ సూపర్‌స్టార్‌?

కోలీవుడ్‌లో ఇప్పుడు ఓ న్యూస్‌ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే హాస్యనటుడు సూరికి జంటగా లేడీ సూపర్‌స్టార్‌ నయనతార నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం.

కోలీవుడ్‌లో ఇప్పుడు ఓ న్యూస్‌ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే హాస్యనటుడు సూరికి జంటగా లేడీ సూపర్‌స్టార్‌ నయనతార నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. ఈ చిత్రానికి సుమారు మూడు కోట్ల వరకూ పారితోషికం పుచ్చుకుంటున్నారట నయనతార. అదేవిధంగా చేతి నిండా చిత్రాలతో బిజీబిజీగా ఉన్న ఈ మాలీవుడ్‌ భామతో పెద్దపెద్ద స్టార్‌ హీరోలు నటించడానికి ఆసక్తి చూపుతున్నా, కాల్‌షీట్స్‌ లేవంటూ నో అంటున్న పరిస్థితి.

మాయ చిత్రం తరువాత అమ్మడికి లేడీ ఓరియెంటెడ్‌ కథా చిత్రాలు వరుసగా తలుపు తడుతున్నాయి. నిజానికి మాయ చిత్రం తరువాత నయనతార నటించిన ఒక్క లేడీ ఓరియెంటెడ్‌ కథా చిత్రమూ తెరపైకి రాలేదు. అయితే కొలైయుధీర్‌ కాలం, డోర, అరమ్‌ తరహా చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో డోర చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. నయనతార కూడా ఇలాంటి కథా చిత్రాల్లో నటించడానికే ఇష్టడడుతున్నట్లు సమాచారం.

తాజాగా నవ దర్శకుడొకరు నయనతారకు ఒక కథ వినిపించారట. పూర్తి వినోదభరితంగా సాగే ఆ కథ ఆమెకు విపరీతంగా నచ్చేసిందని సమాచారం. అందులో హీరోగా ప్రస్తుతం హాస్యనటుడిగా బిజీగా ఉన్న సూరి హీరో అని తెలిసినా అందులో నటించడానికి నయనతార సై అన్నట్లు వార్త సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. హాస్య నటుడు సూర్యకు జంటగా నయనతార నటించడానికి సమ్మతించినట్లు జరుగుతున్న ప్రచారం కోలీవుడ్‌ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. అయితే ఇందులో నిజమెంత అన్నది నిలకడ మీదే తెలియాల్సి ఉంది.

గతంలో నటి శ్రియ టాప్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలో హాస్యనటుడు వడివేలుతో సింగిల్‌ సాంగ్‌లో నటించడానికి అంగీకరించి తన మార్కెట్‌నే కోల్పోయిన విషయం తెలిసిందే.  దీంతో నయనతార ఈ చిత్రంలో నటిస్తున్నారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఈ చిత్రం గురించి అధికారక ప్రకటన వెలువడేవరకూ వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement