ఫైటింగ్‌ కోసం చైనాకు.. | Actress Emyzackson will be acting as an action heroine. | Sakshi
Sakshi News home page

ఫైటింగ్‌ కోసం చైనాకు..

Jun 18 2017 2:05 AM | Updated on Oct 2 2018 3:04 PM

ఫైటింగ్‌ కోసం చైనాకు.. - Sakshi

ఫైటింగ్‌ కోసం చైనాకు..

సినిమాల కోసం రిస్క్‌ తీసుకునే విషయంలో హీరోలతో హీరోయిన్లు పోటీపడుతున్నారు.

సినిమాల కోసం రిస్క్‌ తీసుకునే విషయంలో హీరోలతో హీరోయిన్లు పోటీపడుతున్నారు. బాహుబలి–2 చిత్రం కోసం ప్రభాస్, రానాలతో పాటు ఆ చిత్ర కథానాయకి అనుష్క చాలానే కసరత్తులు చేశారు. ఇక ఇటీవల సంఘమిత్ర చిత్రం కోసం అంటూ నటి శ్రుతీహాసన్‌ లండన్‌కు వెళ్లి కత్తిసాము లాంటి విలు విద్యల్లో శిక్షణ పొందిన విషయం తెలిసిందే.


అయితే ఆ చిత్రం నుంచి ఆమె అనూహ్యంగా వైదొలిగారు. కాగా శివకార్తికేయన్‌తో నటించడానికి నటి సమంత కరాటే విద్యతో కుస్తీలు పట్టినట్లు ఫొటోలు మీడియాలో ఇప్పటికే హల్‌చల్‌ చేశాయి. తాజాగా నటి ఎమీజాక్సన్‌ యాక్షన్‌ హీరోయిన్‌గా అవతారమెత్తనున్నారు. అందుకోసం ఫైటింగ్‌లో శిక్షణ పొందడానికి చైనా వెళ్లనున్నారట. రజనీకాంత్‌తో 2.ఓ చిత్రంలో నటించిన ఎమీ ఆ చిత్ర విడుదల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కొత్తగా అవకాశాలేమీ చేతిలో లేవు. హిందీ చిత్రం క్వీన్‌ రీమేక్‌లో నటించనున్నట్లు ప్రచారం జరుగుతున్నా, ఆ విషయం గురించి క్లారిటీ లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో ఎమీకి ఆంగ్ల చిత్రంలో నటించే అవకాశం వచ్చిందట. బ్రిటీష్‌ దర్శకుడు ఆండ్రూ మోరహన్‌ దర్శకత్వంలో ఇప్పటికే ఎమీ బుకీమెన్‌ అనే చిత్రంలో నటించారు. తాజాగా అదే దర్శకుడు ఈ అమ్మడికి మరో అవకాశం కల్పించారట. ఇది ఫుల్‌లెంగ్త్‌ యాక్షన్‌ కథా చిత్రంగా ఉంటుందట. దాంతో ఎమీకి ఫైటింగ్‌లో శిక్షణ పొందమని దర్శకుడు సూచించారట.అందుకు అంగీకరించిన ఎమీ మూడు నెలల పాటు చైనాలో ఫైటింగ్‌లో శిక్షణ పొందాలని నిర్ణయించుకున్నారట. త్వరలోనే చైనాకు ఎగిరిపోనుందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement