నేత్రదానం మహాదానం | Actor Santhanam 100 Free Eye Surgeries in Tamil Nadu | Sakshi
Sakshi News home page

నేత్రదానం మహాదానం

Jun 7 2019 10:37 AM | Updated on Jun 7 2019 10:37 AM

Actor Santhanam 100 Free Eye Surgeries in Tamil Nadu - Sakshi

ఆస్పత్రి ప్రారంభోత్సవంలో నటుడు సంతానం, డాక్టర్‌ ఆదిల్‌ అగర్వాల్‌

కొరుక్కుపేట: నేత్రదానం మహాదానమని ప్రముఖ సినీనటుడు సంతానం పేర్కొన్నారు. ఈ మేరకు కంటి వైద్య చికిత్సలో ఆధునిక టెక్నాలజీని జోడించి నేత్ర వైద్య సేవలను అందిస్తున్న డాక్టర్‌ అగర్వాల్‌ కంటి ఆస్పత్రి చెన్నై శివారు ప్రాంతం అంబత్తూర్‌లో డాక్టర్‌ అగర్వాల్‌ ఐ కేర్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. గురువారం జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నటుడు సంతానం పాల్గొని రిబ్బన్‌ కట్‌ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా డాక్టర్‌ అగర్వాల్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఐ హాస్పటల్స్‌ సీఈఓ డాక్టర్‌ ఆదిల్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ అంబత్తూర్‌లో తమ శాఖ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు . ప్రారంభోత్సవ సందర్భంగా అర్హులైన పేదలు 100మందికి ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు అందిస్తామని ప్రకటిస్తూ పేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అంబత్తూర్‌ ప్రజలకు తమ సేవలను చేరువ చేయడం మరింత ఆనందంగా ఉందన్నారు. డాక్టర్‌ అగర్వాల్‌ కంటి ఆస్పత్రి అంబూత్తూర్‌ క్లినికల్‌ సర్వీసెస్‌ హెడ్‌ డాక్టర్‌ కౌశిక్‌ పిబి మాట్లాడుతూ అన్ని రకాల ఆధునిక వైద్య పరికరాలతో ఐ కేర్‌ సేవలు అందులో కార్నియా , క్యాటరాక్ట్, గ్లకోమా, పెడియాట్రిక్‌ ఐ కేర్‌ ట్రీట్‌మెంట్‌లు ఇంకా న్యూరో ఆప్తమాలజీ, రెటినా, లో విజన్‌ రెహాబిలిటేషన్‌ సేవలను కల్పిస్తున్నట్టు తెలిపారు. అనంతరం నటుడు సంతానం మాట్లాడూతూ ప్రముఖ కంటి ఆస్పత్రిగా రాణిస్తున్న డాక్టర్‌ అగర్వాల్‌ ఆస్పత్రి సేవలు ప్రశంసనీయమన్నారు. అన్ని దానాల్లోకంటే నేత్రదానం మహాదానం అని పేర్కొన్నారు . నేత్రదానం చేసేందుకు యువత ముందకు రావాలని పిలుపునిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement