నటుడు సాక్షి శివకు కరోనా పాజిటివ్

సాక్షి, హైదరాబాద్: మహమ్మారి కరోనా బుల్లితెర నటులను వెంటాడుతోంది. ఇప్పటికే పలువురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. తాజాగా మరో నటుడు ప్రాణాంతక వైరస్ బారిన పడ్డాడు. టీవీ నటుడు సాక్షి శివకు కరోనా సోకినట్లు సమాచారం. వివిధ చానెళ్లలో ప్రసారమవుతున్న అక్క మొగుడు, నెంబర్ 1 కోడలు, మౌనరాగం సీరియల్స్‌లో నటిస్తున్న శివకు కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో మరోసారి టీవీ పరిశ్రమలో కలకలం రేగింది. వరుసగా పలువురికి కరోనా సోకుతుండటంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేస్తున్నా.. కేసులు పెరుగుతున్నాయని వాపోతున్నారు. (తెలుగు టీవీ నటికి కరోనా పాజిటివ్ )
మరోవైపు.. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్‌కు రావాలో.. వద్దో అర్థం కాక టీవీ నటులు అయోమయంలో పడ్డారు. కాగా ఇప్పటికే ఇద్దరు నటులు సహా ప్రముఖ చానెల్‌లో ప్రసారమవుతున్న ఆమె కథ సీరియల్ కథానాయిక నవ్య స్వామి కరోనా బారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిన నవ్య.. తాను ధైర్యంగా మహమ్మారితో పోరాడతానని, ఎవరూ ఆందోళన చెందవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి