
చిన్నారులతో నటుడు భానుచందర్ సందడి
సీరియల్ షూటింగ్స్‌తో బిజీగా గడిపే ప్రముఖ సినీ నటుడు భానుచందర్ వికలాంగ చిన్నారులతో సరదగా ఆడిపాడారు.
రహమత్‌నగర్ (హైదరాబాద్) : సీరియల్ షూటింగ్స్‌తో బిజీగా గడిపే ప్రముఖ సినీ నటుడు భానుచందర్ వికలాంగ చిన్నారులతో సరదగా ఆడిపాడారు. రహమత్‌నగర్ డివిజన్‌లోని ఎన్.ఎస్.బీ.నగర్ వికలాంగుల పాఠశాల (భవిత కేంద్రం)ను శుక్రవారం భానుచందర్ సందర్శించారు.
చెవి, మూగ, మానసిక వికలాంగులైన చిన్నారులతో కొద్దిసేపు గడిపారు. మరోసారి తన కొడుకుతో కలిసి భవిత కేంద్రాన్ని తప్పక సందర్శిస్తానని నిర్వాహకులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నాగమణి, శ్యాంసుందర్, శ్రీనివాస్‌లతో పాటు బిజేపీ నాయకుడు కొలన్ సత్యనారాయణ సైతం పాల్గొన్నారు.