అప్పుడు రోజా... ఇప్పుడు డ్యూయెట్! | Action love story 'Duet' | Sakshi
Sakshi News home page

అప్పుడు రోజా... ఇప్పుడు డ్యూయెట్!

Nov 12 2016 11:07 PM | Updated on Sep 4 2017 7:55 PM

అప్పుడు రోజా... ఇప్పుడు డ్యూయెట్!

అప్పుడు రోజా... ఇప్పుడు డ్యూయెట్!

హృదయానికి హత్తుకునే ప్రేమకథలు మాత్రమే కాదు, యాక్షన్ చిత్రాలు తీయడంలోనూ దర్శకుడు మణిరత్నంది ప్రత్యేక శైలి.

హృదయానికి హత్తుకునే ప్రేమకథలు మాత్రమే కాదు, యాక్షన్ చిత్రాలు తీయడంలోనూ దర్శకుడు మణిరత్నంది ప్రత్యేక శైలి. లవ్ అండ్ యాక్షన్ మేళవించి ఆయన తీసిన ‘రోజా’ విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందు కుంది. అటువంటి చిత్రాన్ని మణిరత్నం మళ్లీ తెరకెక్కిస్తున్నారు. కార్తీ, అదితీరావ్ హైదరీ జంటగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ప్రేమకథ ‘డ్యూయెట్’. దీన్ని తెలుగులో ‘దిల్’ రాజు విడుదల చేస్తున్నారు. మార్చిలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి కెమేరా: రవి వర్మన్, సంగీతం: ఏఆర్ రెహమాన్, సమర్పణ: శిరీష్.
 

Advertisement
 
Advertisement
Advertisement