సినిమా సెట్లోనే అభి అలా చేశాడు!! | Abhishek Bachchan Proposed To Aishwarya Rai With The Ring Used In Guru Movie | Sakshi
Sakshi News home page

సినిమా సెట్లోనే అభి అలా చేశాడు!!

Jul 31 2018 7:45 PM | Updated on Jul 31 2018 8:47 PM

Abhishek Bachchan Proposed To Aishwarya Rai With The Ring Used In Guru Movie - Sakshi

రింగ్‌ గురించి అభిషేక్‌ చెప్పిన నిజం విని షాకయ్యారట ఐష్‌.

అందానికే అసూయ పుట్టించే అందం ఐశ్వర్యా రాయ్‌ సొంతం. పెళ్లై, ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా ఐష్‌ అందం ఇసుమంత కూడా తగ్గలేదనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అటువంటి అందాన్ని సొంతం చేసుకోవడానికి ఎంతో మంది పోటీ పడినప్పటికీ అభిషేక్‌ బచ్చన్‌నే ఆ అదృష్టం వరించింది. ఐష్‌ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న అభిషేక్‌.. ఆ విషయాన్ని వెంటనే ఆమెకు తెలియజేయాలని నిశ్చయించుకున్నాడట. ఇంకా ఆలస్యం చేయకూడదనే ఉద్దేశంతో ‘గురు’  సినిమాలో సెట్లోనే ప్రపోజ్‌ చేయాలని భావించాడట. వెంటనే తన దగ్గర ఉన్న రింగ్‌తో ఐష్‌కు ప్రపోజ్‌ చేశాడు.

ఆహ్లాదభరితమైన న్యూయార్క్‌ నగరంలో.. చెట్లతో నిండిన బాల్కనీలో అభిషేక్‌ ప్రపోజ్ చేయడంతో ఐష్‌ కూడా వెంటనే తన అంగీకారం తెలిపారట. అయితే రింగ్‌ గురించి అభిషేక్‌ చెప్పిన నిజం విని షాకయ్యారట ఐష్‌. అది గురు సినిమా షూటింగ్‌లో ఉపయోగించిన ఫేక్‌ రింగ్‌ అని తెలిసినప్పటికీ అభి ప్రేమ మాత్రం నిజమే కదా అని సరిపెట్టుకున్నారట. ఇదంతా పదకొండేళ్ల క్రితం నాటి సంగతి. ఎన్ని రోజులు గడిచిన ప్రేమ తాలూకు అనుభూతులు మాత్రం చెరిగిపోవు కదా. అందుకే ఇటీవలే పెళ్లిరోజు వేడుకలు చేసుకున్న ఈ జంట గత స్మృతులను గుర్తు చేసుకున్నారట.

అయితే పదకొండేళ్ల నుంచి కూడా ఈ జంటపై ఏదో ఒక రూమర్‌ వస్తూనే ఉంది. ఐశ్వర్య ఇగోయిస్ట్‌ అనీ, అభిషేక్‌ ఆమెతో వేగలేకపోతున్నారనీ, త్వరలోనే ఈ కపుల్‌ విడిపోయే అవకాశాలున్నాయంటూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. పెళ్లయ్యాక కూడా అభిషేక్‌ తల్లిదండ్రులతోనే కలిసి ఉండటం ఐశ్వర్యకు నచ్చడం లేదని, ఐశ్వర్య తన మాజీ కో స్టార్‌లతో కలివిడిగా ఉండటం అభిషేక్‌కు చికాకు తెప్పిస్తోందని... ఇలా ఏవేవో పుకార్లు షికార్లు చేస్తున్నా.. అవేమీ పట్టించుకోకుండా తమ గారాల పట్టి ఆరాధ్యతో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు అభీ- ఐష్‌లు. త్వరలోనే ఇద్దరూ కలిసి ‘గులాబ్‌ జామూన్‌’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు కూడా.

Advertisement
 
Advertisement
Advertisement