నవ్వులు పంచే ఏబీసీడీ | ABCD first look released | Sakshi
Sakshi News home page

నవ్వులు పంచే ఏబీసీడీ

Dec 29 2018 1:03 AM | Updated on Dec 29 2018 1:03 AM

ABCD first look released - Sakshi

అల్లు శిరీష్‌

కథాబలం ఉన్న సినిమాలతో ప్రేక్షకుల్ని అల రిస్తున్న అల్లు శిరీష్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఏబీసీడీ’. సంజీవ్‌ రెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్‌టైన్‌మెంట్, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ పతాకాలపై ‘మధుర’ శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని నిర్మించారు. రుక్సార్‌ థిల్లాన్‌ కథానాయికగా నటించారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్న ‘ఏబీసీడీ’ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. చిత్రనిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘ఏబీసీడీ’ని రీమేక్‌ చేయడం హ్యాపీగా ఉంది.

తెలుగు ప్రేక్షకులంతా ఎంజాయ్‌ చేసే కథ కావడంతో రీమేక్‌ చేశాం. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలో మార్పులు చేశాం. మలయాళంలో దుల్కర్‌ పోషించిన పాత్రను తెలుగులో శిరీష్‌ పోషించారు. అల్లు శిరీష్‌ తండ్రి పాత్రలో నాగబాబుగారు నటించారు. బాల నటుడు భరత్‌ ఈ చిత్రంలో శిరీష్‌ ఫ్రెండ్‌ క్యారెక్టర్‌ చేశారు. మా సినిమా ఫస్ట్‌ లుక్‌కి మంచి స్పందనతో పాటు, చాలా కాంప్లిమెంట్స్‌ వస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: డి.సురేశ్‌బాబు, సంగీతం: జుధా సాంధీ, సహ నిర్మాత: ధీరజ్‌ మొగిలినేని.

Advertisement
 
Advertisement
Advertisement