నేనిలా ఉండటానికి కారణం నువ్వే

Aamir Khan FIRST Instagram Post Dedicated To Mother Zeenat Hussain - Sakshi

53వ పుట్టినరోజు సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌ లో అకౌంట్‌ ఓపెన్‌ చేశారు బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌. అకౌంట్‌ ఓపెన్‌ చేసిన కొద్ది సమయంలోనే ఆయన్ను ఫాలో అవ్వడం మొదలుపెట్టారు ఫ్యాన్స్‌. మొదటి పోస్ట్‌గా ‘‘నేనిలా ఉన్నానంటే దానికి కారణం నువ్వే’’ అంటూ తల్లి జీనత్‌ హుసేన్‌ ఫొటోను అప్‌లోడ్‌ చేశారు ఆమిర్‌ ఖాన్‌. ‘‘బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు.

ఈరోజు ఇంట్లోవాళ్లతో గడపమని మా డైరెక్టర్‌ (విజయ్‌కృష్ణ ఆచార్య) నన్ను త్వరగా షూటింగ్‌ నుంచి వదిలేశారు. సాయంత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌కి వస్తాను’’ అంటూ మొదటి ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీగా వీడియోను పోస్ట్‌ చేశారు ఆమిర్‌ ఖాన్‌.  ప్రస్తుతం జోద్‌పూర్‌లో ‘థగ్స్‌ ఆఫ్‌ హిందోస్తాన్‌’ షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆమిర్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ కోసం ముంబైలో వాలిపోయారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top