ఆసక్తి కలిగిస్తున్న ఆద్య, సితారల ‘టెలిపతి ఛాలెంజ్‌’ | Aadya And Sitara Telepathy Challenge Viral In Social Media | Sakshi
Sakshi News home page

ఆసక్తి కలిగిస్తున్న ఆద్య, సితారల ‘టెలిపతి ఛాలెంజ్‌’

Mar 22 2020 4:41 PM | Updated on Mar 22 2020 4:41 PM

Aadya And Sitara Telepathy Challenge Viral In Social Media - Sakshi

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు గారాలపట్టి సితార తన బెస్ట్ ఫ్రెండ్ ఆద్యతో కలిసి ఏఅండ్‌ఎస్‌ అనే యూట్యూబ్‌ చానల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ యూట్యూబ్‌ ఛానల్‌లో పలు విభిన్న వీడియోలను పోస్ట్‌ చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్నారు. వివిధ గేమ్స్‌కు సంబంధించిన వీడియోలతో పాటు సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేస్తూ హైలైట్‌గా నిలుస్తున్నారు. మహేశ్‌ బాబుతో పాటు రష్మిక మందనను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో సితార, ఆద్యలు ప్రొఫెషనల్‌ యాంకర్స్‌ను తలపించారు. తాజాగా అందరికీ హాలీడే అయిన ఆదివారాన్ని ఫన్‌గా క్రియేట్‌ చేసేందుకు తమ ఏఅండ్‌ఎస్‌ ఛానల్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. టెలిపతి (మానసిక ఊహా శక్తి) చాలెంజ్‌లో పాల్గొన్న ఈ ఇద్దరు ఆద్యంతం ఆసక్తి కలిగించేలా ఆడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. పిల్లలకు ఎంతో ఉపయోగకరమైన టెలిపతి చాలెంజ్‌ను తాము కూడా ఆడతామని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement