ఆట మొదలు

Aadhi Pinisetty signs sports drama - Sakshi

మైదానంలోకి దిగి ఆట ఆడటానికి ఫుల్‌గా ప్రిపేర్‌ అయ్యారు ఆది పినిశెట్టి. ప్రిత్వి ఆదిత్య దర్శకత్వంలో ఆది  హీరోగా ఓ స్పోర్ట్స్‌ డ్రామా తెరకెక్కనుంది. బిగ్‌ ప్రింట్‌ పిక్చర్స్‌ పతాకంపై ఐబీ కార్తికేయన్‌ నిర్మించ నున్నారు. పీఎంఎం ఫిల్మ్స్, జి. మనోజ్, జి. శ్రీహర్ష సహ నిర్మాతలు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 12న ప్రారంభం కానుంది. ‘‘ఓ యువకుడు అథ్లెట్‌గా మారే క్రమంలో ఎలాంటి పరిస్థితులను ఫేస్‌ చేశాడు. వాటిని అధికమించి ఎలా ఉన్నతస్థాయికి చేరుకున్నాడన్నదే కథాంశం. త్వరలోనే వివరాలు వెల్లడిస్తాం’’ అని యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు. ఈ సినిమాకు కెమెరా: ప్రవీణ్‌ కుమార్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top