వర్త్ ఉంటే... లక్ ఉంటుంది! | A R Rahman Superhit roja movie | Sakshi
Sakshi News home page

వర్త్ ఉంటే... లక్ ఉంటుంది!

Jul 21 2015 11:22 PM | Updated on Sep 3 2017 5:54 AM

వర్త్ ఉంటే... లక్ ఉంటుంది!

వర్త్ ఉంటే... లక్ ఉంటుంది!

‘రోజా’ చిత్రం గుర్తుకు రాగానే, అందులోని ఆహ్లాదకరమైన పాటలు గుర్తొస్తాయి. సంగీతదర్శకుడిగా ఎ.ఆర్. రహమాన్‌కి అది తొలి చిత్రం.

‘రోజా’ చిత్రం గుర్తుకు రాగానే, అందులోని ఆహ్లాదకరమైన పాటలు గుర్తొస్తాయి. సంగీతదర్శకుడిగా ఎ.ఆర్. రహమాన్‌కి అది తొలి చిత్రం. వాస్తవానికి స్వర్గీయ మహేశ్ మహదేవన్ (తెలుగు ‘ప్రేమించుకుందాం రా’ మ్యూజిక్ అతనిదే)ను సంగీతదర్శకుణ్ణి తీసుకోవాలని చిత్రదర్శకుడు మణిరత్నం అనుకున్నారు. కానీ, మహేశ్ ఆరోగ్యం బాగా లేకపోవడంతో రహమాన్‌ని తీసుకున్నారు. ఆ చిత్రం రహమాన్‌కి మంచి బ్రేక్ అయింది.
 
 ‘రోజా’ చిత్రానికి పాటలెంత ప్లస్సో, కథానాయిక మధుబాల కూడా అంతే ప్లస్. మధుబాల అందం, అభినయం అందర్నీ ఆకట్టుకున్నాయి. వాస్తవానికి ఈ పాత్రకు మణిరత్నం ముందు ఐశ్వర్యా రాయ్‌ని ఎంపిక చేశారు. కానీ, తేదీలు ఖాళీ లేకపోవడంతో ఐష్ ఈ చిత్రాన్ని తిరస్కరించారు. అది మధుబాలకు ప్లస్ అయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement