ఎ సర్టిఫికెట్‌ను మించిన సినిమా! | A certificate is beyond the movie! | Sakshi
Sakshi News home page

ఎ సర్టిఫికెట్‌ను మించిన సినిమా!

Jun 20 2015 12:05 AM | Updated on Apr 3 2019 6:23 PM

ఎ సర్టిఫికెట్‌ను మించిన సినిమా! - Sakshi

ఎ సర్టిఫికెట్‌ను మించిన సినిమా!

సన్నీలియోన్ ఇప్పటివరకూ బాలీవుడ్‌లో చేసిన సినిమాలకు సెన్సార్ వాళ్లు అడ్డు చెప్పలేదు. ఎందుకంటే అలాంటి సన్నివేశాలు ప్రతి బాలీవుడ్ చిత్రంలోనూ కామనైపోయాయి ...

 సన్నీలియోన్ ఇప్పటివరకూ బాలీవుడ్‌లో చేసిన సినిమాలకు సెన్సార్ వాళ్లు అడ్డు చెప్పలేదు. ఎందుకంటే అలాంటి సన్నివేశాలు ప్రతి బాలీవుడ్ చిత్రంలోనూ కామనైపోయాయి సెన్సార్ సభ్యులు కూడా చూసి చూడన్నట్టు వదిలేస్తున్నారు. కానీ సెన్సార్ వాళ్లు కూడా మేము చూడలేం బాబోయ్ అని చేతులెత్తేస్తే...! అది ఏ సినిమా అనుకుంటున్నారా! .
 
  అసలు విషయంలోకి వెళితే... మిలాప్ జవేరి దర్శకత్వంలో సన్నీలియోన్ నటించిన చిత్రం ‘మస్తిజాదే’. ఈ సినిమా ట్రైలర్ చూసి షాకైన సెన్సార్ సభ్యులు ఇక సినిమా కూడా చూసి చేతులెత్తేశారు. ఇక చేసేది లేక చిత్ర నిర్మాతలు రివైజింగ్ కమిటీని ఆశ్రయించారు. వాళ్లు కూడా సినిమా చూసి నోరెళ్లబెట్టారు. ఇక ఏం చేయాలో తోచక ట్రిబ్యునల్‌ను ఆశ్ర యించారు. ఏదో అనుకుని చూసిన ట్రిబ్యునల్ సభ్యులు అందులో సన్నివేశాలు చూసి విస్తుపోయారట.
 
 దీంట్లో చాలా అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయని, ఒకవేళ ‘ఎ’ సర్టిఫికెట్ ఇద్దామన్నా, ఆ లెవెల్‌ను ఎప్పుడో ఈ సినిమా దాటిపోయిందని వ్యాఖ్యానించారు. దాదాపు 36 ఏళ్ల తర్వాత సెన్సారింగ్‌లో ఉన్న మూడు స్థాయిల్లోనూ తిరస్కరణకు గురైన సినిమా ఇదేనని బాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement