టాప్ త్రీలో అ..ఆ.. | A Aa is collecting good and stays next to Srimanthudu | Sakshi
Sakshi News home page

టాప్ త్రీలో అ..ఆ..

Jun 7 2016 12:59 PM | Updated on Sep 4 2017 1:55 AM

టాప్ త్రీలో అ..ఆ..

టాప్ త్రీలో అ..ఆ..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో.. నితిన్, సమంత హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా అ..ఆ.. అనసూయ రామలింగం వర్సెన్ ఆనంద్ విహారి...

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో.. నితిన్, సమంత హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా అ..ఆ.. అనసూయ రామలింగం వర్సెన్ ఆనంద్ విహారి అనే ట్యాగ్ లైన్తో తెరకెక్కిన ఈ సినిమా గత శుక్రవారం రిలీజ్ అయి మంచి టాక్ సొంతం చేసుకుంది. వేరే సినిమాలేవి బరిలో లేకపోవటం, సమ్మర్ సీజన్కు ఆఖరి చిత్రం కావటంతో కలెక్షన్ల పరంగా కూడా ఆకట్టుకుంటోంది.

ముఖ్యంగా త్రివిక్రమ్ మార్క్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ఓవర్సీస్లో భారీ వసూళ్లను రాబడుతోంది. తొలి వారాంతనికి 1.7 మిలియన్ డాలర్లను వసూళు చేసిన అ..ఆ.. స్టార్ హీరోలకు షాక్ ఇస్తుంది. బాహుబలి, శ్రీమంతుడు సినిమాలు తప్ప ఇంత వరకు తొలి వారమే ఈ స్థాయి కలెక్షన్లు సాధించిన తెలుగు సినిమా మరోటి లేదు. దీంతో త్రివిక్రమ్తో పాటు నితిన్ మార్కెట్ రేంజ్ కూడా భారీగా పెరిగిటనట్టే అని భావిస్తున్నారు.

తొలి వారాంతానికి 4.4 మిలియన్ డాలర్లు వసూలు చేసి బాహుబలి టాప్ ప్లేస్లో ఉండగా, 2.09 మిలియన్ డాలర్లతో శ్రీమంతుడు రెండో స్ధానంలో నిలిచింది. 1.7 మిలియన్ డాలర్లతో అ..ఆ.., ఆ తరువాతి స్థానంలో నిలిచింది. నాన్నకు ప్రేమతో, అత్తారింటికి దారేది లాంటి భారీ బ్లాక్ బస్టర్స్ను దాటి అ..ఆ.. వసూళ్లు సాధించటం ట్రేడ్ పండితులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement