బాలీవుడ్ తెరపై సినిమా పండుగ | 7 big releases in bollywood | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ తెరపై సినిమా పండుగ

Sep 3 2015 12:22 PM | Updated on Apr 3 2019 6:23 PM

ఆగస్ట్లో బ్రదర్స్, మాంఝీ - ద మౌంటెయిన్ మేన్, ఫాంటమ్ లాంటి బిగ్ రిలీజ్ లతో అలరించిన బాలీవుడ్ ఇండస్ట్రీ ఈ నెలలో మరిన్ని భారీ రిలీజ్లతో ఆకట్టుకోనుంది. స్టార్ హీరోలు...

ఆగస్ట్లో బ్రదర్స్, మాంఝీ - ద మౌంటెయిన్ మేన్, ఫాంటమ్ లాంటి బిగ్ రిలీజ్ లతో అలరించిన బాలీవుడ్ ఇండస్ట్రీ ఈ నెలలో మరిన్ని భారీ రిలీజ్లతో ఆకట్టుకోనుంది. స్టార్ హీరోలు నటించిన కామెడీ ఎంటర్టైనర్ లతో పాటు రీమేక్లు రియలిస్టిక్ సినిమాలు కూడా ఈ నెలలో అలరించనున్నాయి.

సెప్టెంబర్ నెలలో బాలీవుడ్ ఖాతా తెరుస్తున్న తొలి సినిమా జాన్ అబ్రహం ప్రదాన పాత్రలో నటించిన 'వెల్ కం బ్యాక్'. అక్షయ్ కుమార్ సూపర్ హిట్ మూవీ 'వెల్ కం' కు సీక్వల్ గా తెరకెక్కిన ఈ సినిమాకు అనీజ్ బజ్మీ దర్శకుడు. అనీల్ కపూర్, నానాపటేకర్, పరేష్ రావల్ నటిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ మరో ఇంపార్టెంట్ రోల్లో కనిపిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అవుతోంది.

ఈ సినిమా తరువాత రిలీజ్కు రెడీ అవుతున్న మరో బాలీవుడ్ ఎంటర్టైనర్ 'హీరో'.. సల్మాన్ హోం ప్రొడక్షన్ నుంచి వస్తున్న ఈ సినిమాతో సూరజ్ పచౌలి, అథియా శెట్టి లు వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ తో పాటు ఆడియోకు కూడా మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా కూడా మంచి సక్సెస్ అవుతుందని హీరో టీం నమ్మకంగా ఉన్నారు.

'తను వెడ్స్ మను రిటర్న్స్'  సక్సెస్ తరువాత కంగన ప్రధాన పాత్రలో నటించిన 'కట్టిబట్టి', రియలిస్టిక్ సినిమాల స్పెషలిస్ట్ మధుర్ బండార్కర్ డైరెక్ట్ చేసిన 'క్యాలెండర్ గర్ల్స్' సినిమాలు కూడా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకురానున్నాయి. వీటితో పాటు బుల్లితెర కింగ్ కపిల్ శర్మ హీరోగా నటించిన 'కిస్ కిస్ కో ప్యార్ కరూ', వివాదాస్పద చిత్రం 'మెసెంజర్ ఆఫ్ గాడ్' కు సీక్వల్ గా రూపొందిన 'మెసెంజర్ ఆఫ్ గాడ్ 2'  సినిమాలు కూడా ఈ నెలలోనే రిలీజ్ అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement