షూటింగ్‌లో నాకూ అలాగే జరిగింది : నటి | 24 Series Actress Sapna Pabbi Supports Tanushree Dutta | Sakshi
Sakshi News home page

Oct 5 2018 11:11 AM | Updated on Oct 5 2018 12:01 PM

24 Series Actress Sapna Pabbi Supports Tanushree Dutta - Sakshi

సప్నా పబ్బీ

నానా పటేకర్‌ వంటి బాలీవుడ్‌ ప్రముఖులపై వేధింపుల ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన తనుశ్రీ దత్తాకు తన మద్దతు ప్రకటించారు.

సాక్షి, న్యూఢిల్లీ : లైంగిక వేధింపులపై టీవీ నటి సప్నా పబ్బీ నోరు విప్పారు. పని ప్రదేశంలో మహిళలకు రక్షణ లేదని ఆమె వాపోయారు. నానా పటేకర్‌ వంటి బాలీవుడ్‌ ప్రముఖులపై వేధింపుల ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన తనుశ్రీ దత్తాకు తన మద్దతు ప్రకటించారు. అనిల్‌కపూర్‌ ప్రధాన పాత్రలో రూపొందిన ‘24’  సిరీస్‌లో సప్నా నటించారు. 24 చిత్రీకరణ సమయంలో దర్శకుడు తనపట్ల ఎంత దురుసుగా ప్రవర్తించాడో తెలుపుతూ సప్నా సోషల్‌ మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. (ఏంటి ఇదేమన్నా జోక్‌ అనుకుంటున్నారా : నటి)

వెకిలి నవ్వులు..
పాటకు రిహార్సల్స్‌ చేస్తున్నప్పుడు ఒక బిగుతైన బికినీ వేసుకోవాల్సి వచ్చిందనీ, అది తనకెంతో అన్‌కంఫర్ట్‌గా అనిపించిందని సప్నా పేర్కొన్నారు. ఆ ఇబ్బందికి పరిష్కారంగా నేనొక చిన్న సలహా ఇస్తే ఎవరూ పట్టించుకోలేదని వివరించారు. పైగా తన మాటలకు దర్శకుడు, స్టైలిస్ట్‌ (లేడీ) వెకిలిగా నవ్వి తనను మరింత బాధపెట్టారని ఆమె తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. దాదాపు 7 గంటలపాటు ఆ బికినీ ధరించాల్సి రావడంతో.. ఛాతీ భాగంలో తీవ్రమైన నొప్పి వచ్చిందని సప్నా తన పోస్టులో ఆవేదన చెందారు. తనకు తోడుగా నిలవాల్సిందిపోయి.. నా స్టైలిస్ట్‌ దర్శకుడితో కలిసి జుగుప్సాకరంగా నవ్విందని మండిపడ్డారు. దర్శకుడికి వ్యతిరేకంగా మాట్లాడితే.. ఆ ప్రోగ్రాం నుంచి తనను తొలగిస్తారనే భయంతో ఇన్నాళ్లు ఈ విషయాన్ని బయటపెట్టలేదని తెలిపారు.

కాగా, నటుడు నానా పటేకర్‌తో పాటు దర్శకులు వివేక్‌ అగ్నిహోత్రి, రాకేష్‌ సారంగ్‌, కొరియోగ్రఫర్‌ గణేష్‌ ఆచార్యా, నిర్మాత సామీ సిద్దిఖీలపై తనుశ్రీ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. 

(చదవండి : నానా పటేకర్‌ నుంచి నోటీసులు అందాయ్‌..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement