ఇది నిజమే కదా! కళ్లను నమ్మలేకున్నాం | 12 Popular Women Actors Recreate Ravi Varma Paintings | Sakshi
Sakshi News home page

రవివర్మ పెయింటింగ్‌ను మించిపోయేలా..

Feb 4 2020 3:22 PM | Updated on Feb 4 2020 3:34 PM

12 Popular Women Actors Recreate Ravi Varma Paintings - Sakshi

సమంత

రాజా రవివర్మ కుంచెపట్టాడంటే అది తిరుగులేని అద్భుత కళాఖండంగా మారాల్సిందే. ఆనాటి చిత్రకారుడు గీసిన చిత్రాలు కొద్ది క్షణాలపాటు రెప్పవేయకుండా చూడాల్సిందే. అచ్చంగా రవివర్మ గీసిన చిత్రాల్లా మారిపోయారు నేటితరం తారలు. రవివర్మ బొమ్మల పక్కన ముద్దుగుమ్మలు బుట్టబొమ్మల్లా తయారై పెయింటింగ్‌ను మరిపించేలా ఫొటోలకు ఫోజిచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాను ఊపేస్తున్నాయి.

అలనాటి హీరోయిన్‌ సుహాసిని మహిళా సాధికారతే లక్ష్యంగా నామ్‌ అనే చారిటబుల్‌ ట్రస్ట్‌ను నడిపిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ‘నామ్‌’ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. దీనికి ప్రముఖ సెలబ్రిటీలను ఆహ్వానించింది. సుహాసినికి 12 మంది హీరోయిన్లతో క్యాలెండర్‌ తయారు చేయాలని ఆలోచన తట్టింది. అయితే ఈ క్యాలెండర్‌లోని చిత్రాలు ఆషామాషీగా కాకుండా రవివర్మ పెయింటింగ్స్‌కు ఏమాత్రం తీసిపోకుండా ఉండాలని భావించింది. ప్రముఖ ఫొటోగ్రాఫర్‌, విజువల్‌ ఆర్టిస్ట్‌ వెంకట్‌ రామ్‌ ఆమె ఆలోచనకు తోడయ్యాడు. అంతే.. సమంత, శృతిహాసన్‌ వంటి పలువురు హీరోయిన్లతో రవివర్మ గీసిన చిత్రాలను పున: సృష్టించారు. ఈ ఫొటో షూట్‌లో మంచు లక్ష్మి, ఖుష్బూ, ఐశ్వర్యారాజేశ్‌ కూడా పాల్గొన్నారు. వీరిని చూసిన అభిమానులు నటీమణుల అందాలకు అబ్బురపడిపోతున్నారు. రవివర్మ చేయి నుంచి జాలువారిన చిత్రాల్లా ఉన్నాయని అభిమానులు ప్రశంసిస్తున్నారు.

అయితే అచ్చుగుద్దినట్లుగా రవివర్మ ఫొటోలు కావాలంటే అదేమంత సులువు కాదు. వారి వేషధారణలోనే కాదు, ముఖంలోనూ జీవం ఉట్టిపడాలి. ఏ మాత్రం తేడా వచ్చినా, విమర్శల పాలవడం తథ్యం. కానీ అలాంటి పెయింటింగ్‌కు పోటీగా తీసిన ఫొటోల్లో హీరోయిన్లతోపాటు ఫొటోగ్రాఫర్‌ సైతం బాగానే కష్టపడినట్లు తెలుస్తోంది. సమంత ఫొటో అభిమానులను చూపు తిప్పుకోనివ్వకుండా ఉంది. ఇక శృతి హాసన్‌ రెండు పెయింటింగ్స్‌కు(రెండు నెలలకు గానూ) ఫొటోలు దిగడం విశేషం. ఇంకెందుకాలస్యం, క్యాలెండర్‌ విడుదల కన్నా ముందే మీరూ ఆ చిత్రాలను చూసేయండి.





 











Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement