గంజాయి ప్యాకెట్ల పట్టివేత | Cannabis packets catched by police | Sakshi
Sakshi News home page

గంజాయి ప్యాకెట్ల పట్టివేత

Jan 13 2018 8:22 AM | Updated on Aug 21 2018 6:02 PM

Cannabis packets catched by police - Sakshi

దేవరకద్ర : మండల కేంద్రంలోని పశువుల సంత సమీపంలో శుక్రవారం రాత్రి గంజాయి ప్యాకెట్లను పట్టుకున్నారు. ఎస్‌ఐ అశోక్‌కుమార్‌ కథనం ప్రకారం.. దేవరకద్రకు చెందిన దొబ్బలి ఆంజనేయులు అనే వృద్ధుడు సంతబజార్‌ సమీపంలో చిన్న దేవాలయంతోపాటు అక్కడే ఇల్లు కట్టుకుని కుటుంబంతో ఉంటున్నాడు. చాలా ఏళ్ల నుంచి ఆలయానికి వచ్చే సాధువులతో కలిసి గంజాయి సేవించేవాడు. విషయం పోలీసులకు తెలియడంతో శుక్రవారం అదే ప్రాంతంలో వాహనాలను తనిఖీ చేస్తూ నిఘా వేశారు. సంచిలో గంజాయి ప్యాకెట్లను వేసుకుని దొబ్బలి ఆంజనేయులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకున్నారు.

ఇందులో 350 గ్రాముల గంజాయి 42 చిన్న ప్యాకెట్లుగా ఉందని, గంజాయి ఆకు 130 గ్రాములుగా ఉందని, గంజాయి గింజలు 140 గ్రాములు ఉన్నాయి. ఈ మేరకు వీటిని స్వాధీనం చేసుకుని దొబ్బలి ఆంజనేయులుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. గంజాయి పట్టుకున్న సంఘటనపై విచారణ చేయడానికి డీఎస్పీ భాస్కర్‌ శుక్రవారం రాత్రి పోలీసు స్టేషన్‌కు వచ్చారు. నిందితున్ని విచారణ చేసి వివరాలు తెలుసుకున్నామని గంజాయి ఎక్కడి నుంచి ఇక్కడికి సరాఫరా అవుతుందో తెలుసుకుని తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement