ప్రేమించే స్నేహితుడు! అజ్ఞాత ప్రేమికుడు..

లవ్ సినిమా
సినిమా : తాజ్ మహాల్(2010)
తారాగణం : శివాజీ, శృతి, కోటాశ్రీనివాసరావ్, బ్రహ్మానందం, నాజర్, రఘుబాబు
డైరెక్టర్ : అరుణ్ శింగరాజు
సంగీతం : అభిమన్
కథ : అజయ్( శివాజీ) ఓ నిరుపేద కుటుంబానికి చెందిన యువకుడు. డిగ్రీ చదువుల కోసం హైదరాబాద్ వస్తాడు. నగరంలో అడుగుపెట్టగానే అతడి వేషభాషల్లో, ప్రవర్తనలో చాలా మార్పులు వస్తాయి. పేదవాడిననే విషయాన్ని దాచిపెట్టి బాగా డబ్బున్నవాడినని చెప్పుకుంటూ ఉంటాడు. ఇలాంటి సమయంలోనే తన కాలేజ్‌లో చదివే శృతి(శృతి)తో ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమ కోసం పరితపిస్తాడు. కానీ, శృతి మాత్రం అతడ్ని ఫ్రెండ్‌లానే ట్రీట్ చేస్తుంది. ఇదిలా ఉండగా శృతి, కుమార్ అనే ఓ అజ్ఞాత వ్యక్తితో ప్రేమలో పడుతుంది. అతడ్నే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది. ఈ నేపథ్యంలో శృతి ప్రేమను పొందటానికి అజయ్ చేసే ప్రయత్నాలేంటి? చివరకైనా శృతి! అజయ్ ప్రేమను అంగీకరిస్తుందా? ఇంతకీ ఆ అజ్ఞాత ప్రేమికుడు ఎవరు? అన్నదే మిగితా కథ.
విశ్లేషణ : 2010లో విడుదలైన తాజ్ మహాల్ ఓ ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీ. 2008లో విడుదలైన కన్నడ చిత్రం తాజ్‌మహాల్‌కు ఇది రీమేక్. వన్‌సైడ్ లవర్‌గా శివాజీ నటన అద్భుతంగా ఉంటుంది. అజ్ఞాత ప్రేమికుడి కోసం పరితపించే యువతిగా శృతి నటన ఆకట్టుకుంటుంది. సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోతుంది. పాటలు హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. క్లైమాక్స్‌లో చోటుచేసుకునే సంఘటనలు సినిమాకు హైలెట్‌గా నిలవటమే కాకుండా మన మనసులో ముద్రపడిపోతాయి.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి