నేను, బావా..మధ్యలో తను

Sad Ending Akhila Reddy Telugu Love Story - Sakshi

బావా అనే పదంలో ఉండే ప్రేమ, అనుభూతే వేరు. చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి ఇష్టం. నా స్టడీ అయిపోయింది. ఉద్యోగం వచ్చాక ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అలా జాబ్‌ సెర్చింగ్‌లో ఉండగా కొన్ని రోజులు బావని దూరం పెట్టాను. ఆ దూరం మమ్మల్ని ఇలా విడదీస్తుందని కల్లో కూడా ఊహించలేదు. మా ఇద్దరి జీవితంలో తుఫానులా వచ్చింది ఒక అమ్మాయి. తను నా చిన్ననాటి స్నేహితురాలు. తనకు కూడా తెలుసు బావకి నేనంత ఇష్టమో, నాకు బావంటే ఎంత ఇష్టమో. అన్నీ తెలిసి కూడా తను నా బావను ఇష్టపడింది. ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారని మా ఫ్రెండ్స్‌ చెప్పారు. అయినా  నేనే నమ్మలేదు. ఎందుకంటే నా బావ మీద నాకున్న నమ్మకం. ఆ నమ్మకంతోనే బావతో పెళ్లి గురించి మా ఇంట్లో చెప్పాను. మొదట్లో ఒప్పుకోకపోయినా నా బలవంతంతో ఒప్పుకునేలా చేశాను అంత ఇష్టం నాకు బావంటే. అలాంటిది బావ నన్ను మోసం చేసి వెళ్లిపోయాడని తెలిసి తట్టుకోలేకపోయా. ఎంతో నరకం అనుభవించా ఇప్పటికీ అనుభవిస్తున్నా. 

 మా అమ్మ చనిపోయినప్పుడు తను నాకు బాసటగా నిలిచాడు. అమ్మ లేని బాధను దూరం చేసేంత ప్రేమ కురిపించాడు. ఇప్పుడు నన్ను పిచ్చిదాన్ని చేసి వెళ్లిపోయాడు. ఎందుకు? నా ప్రేమలో లోటుందా? బావా...నువ్వు నన్ను మోసం చేసి ఆ అమ్మాయిని పెళ్లిచేసుకొని వెళ్లిపోయినా నీమీద నాకు కోపం రావట్లేదు ఎందుకు? నిన్ను మర్చిపోలేక వేరే వాళ్లను పెళ్లిచేసుకోలేక ఇటు నాన్నని బాధపెడుతున్నా. ఇష్టం లేకున్నా..బాధనంతా గుండెల్లో పెట్టుకొని బతకాలా? ఎవరికోసం బతకాలి? తనే నా సర్వస్వం అనుకున్నా. అందరిలో తననే చూసుకున్నా. కానీ తను మాత్రం​ అందరిలా నన్ను చూశాడు. నా ప్రేమతో ఆడుకున్నాడు. నా మనసుతో ఆడుకున్నాడు. చిన్నప్పటి నుంచి నువ్వే నా ప్రాణం అని భావించా. అలాంటి నన్ను మోసం చేయాలని ఎలా అనిపించింది బావా?

--అఖిల (పేర్లు మార్చాం)

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

14-02-2020
Feb 14, 2020, 16:50 IST
తన పేరు కౌసల్య! మెడిసిన్‌ చదువుతున్నపుడు మా మధ్య ప్రేమ చిగురించింది. మెడిసిన్‌ అయిపోయిన తర్వాత వేరు వేరు హాస్పిటల్లలో...
14-02-2020
Feb 14, 2020, 15:46 IST
ప్రేమ పేరెత్తితే చాలు నాలుక తెగ్గోస్తారు. ఇలాంటి నేపథ్యంలో యువత ప్రాణాలకు తెగించి.. 
14-02-2020
Feb 14, 2020, 11:56 IST
ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న వాలెంటైన్స్‌ డే రానే వచ్చింది. ప్రియమైన వారితో ఈ రోజును ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకోవాలనుకునేవారు చాలామందే...
14-02-2020
Feb 14, 2020, 10:17 IST
మేషం : మీలోనే దాచుకున్న ప్రేమ విషయాలను ఇష్టులకు తెలియజేసేందుకు శని, ఆదివారాలు అనుకూలం. ఈరోజుల్లో మీరు చేసే ప్రతిపాదనలపై...
14-02-2020
Feb 14, 2020, 08:54 IST
వాళ్లిద్దరూ చిన్ననాటి స్నేహితులు, ప్రేమికులు... ఆ తర్వాత విడిపోయి దశాబ్దాల తర్వాత కలుస్తారు. అప్పటికీ బ్రహ్మచారిగానే ఉన్నప్రేమికుడు, పెళ్లి చేసుకుని...
14-02-2020
Feb 14, 2020, 08:36 IST
త్రేతా యుగంలో సీతారాముల ప్రేమ లోకానికి రావణుడి పీడను వదిలించింది. ద్వాపరంలో సత్యభామ ప్రేమ నరకాసురుడి కథను అంతం చేసింది. కలియుగంలో పద్మావతి...
14-02-2020
Feb 14, 2020, 07:42 IST
సాక్షి, ముషీరాబాద్‌: ప్రేమికులకు గుడ్‌ న్యూస్‌... వాలెంటైన్స్‌ డే రోజున మీరు ఆనందంగా గడిపేందుకు, మీ లవ్‌ను ప్రపోజ్‌ చేసేందుకు,...
14-02-2020
Feb 14, 2020, 00:32 IST
ఇవాళ ప్రేమికుల దినోత్సవం. ప్రేమోత్సవం. ప్రేయసిని ఎలా సర్‌ప్రైజ్‌ చేయాలని ఒకరు, ఈరోజు ఎలా అయినా ప్రేమను చెప్పేయాలని ధైర్యం...
13-02-2020
Feb 13, 2020, 17:05 IST
న్యూఢిల్లీ : ‘ప్రేమ’ అంటే ఎన్నో అనుభూతులు, మరెన్నో అర్థాలు. కాల గమనంలో ప్రేమ వ్యక్తీకరణ పద్ధతులు మారుతూ వస్తున్నాయి....
13-02-2020
Feb 13, 2020, 16:53 IST
అది బాధో! ప్రేమో!.. ఏదో తెలియదు కానీ, నా కళ్లు కొద్దిగా చెమర్చాయి...
13-02-2020
Feb 13, 2020, 15:30 IST
సాక్షి, న్యూఢిల్లీ : యువతీ యువకుల మధ్య ప్రేమ అనేది ఓ మధురానుభూతి. ఈ ప్రేమనే శాస్త్రవిజ్ఞాన పరిభాషలో సంక్లిష్ట...
13-02-2020
Feb 13, 2020, 14:46 IST
నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావ్‌?...
13-02-2020
Feb 13, 2020, 12:03 IST
ప్రేమ.. ఇదిప్పుడు రెండు అక్షరాల కలయిక మాత్రమే కాదు వేల కోట్ల...
13-02-2020
Feb 13, 2020, 10:43 IST
బాగా ప్రాచూర్యం పొందిన ముద్దు ఇది. మోస్ట్‌ రొమాంటిక్‌ కిస్‌...
13-02-2020
Feb 13, 2020, 10:08 IST
ప్రేమ.. అనిర్వచనీయమైన అనుభూతి. వివాహం.. జీవితంలో ఓ మధురమైన ఘట్టం. తమ పెళ్లి జ్ఞాపకాలు జీవితాంతం ఉండేలా.. తమ హృదిలో...
12-02-2020
Feb 12, 2020, 16:56 IST
అక్కడికి తను కూడా వచ్చింది. ఆ రాత్రి భానును చూస్తూ...
12-02-2020
Feb 12, 2020, 15:35 IST
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు మరింత దగ్గర పడింది. రేపు ఒక్కరోజు గడిస్తే ఆ మరుసటి రోజే ప్రేమికుల...
12-02-2020
Feb 12, 2020, 12:30 IST
తనకి ఓ వాలెంటైన్స్‌ డేన చాక్లెట్‌ ఇస్తే వద్దు అంది...
12-02-2020
Feb 12, 2020, 11:39 IST
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ ఇంటర్‌ గ్లోబ్‌ ఏవియేషన్‌ (ఇండిగో).. రూ. 999కే దేశీ రూట్లలో టికెట్‌ అందిస్తోంది....
12-02-2020
Feb 12, 2020, 10:59 IST
ఎంత డబ్బు ఖర్చు చేసినా పొందలేని ఆనందం దీని సొంతం...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top