న్యూ ఇయర్‌లో తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయంటే..

On New Year Day Decisions That People Make - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కొత్త సంత్సరం వస్తుందంటే చాలు ఓ నెల ముందునుంచే తెగ హైరానా పడిపోతుంటాం. ఈ సంవత్సరం నుంచి ఇవి మానేయాలి, అవి నేర్చుకోవాలి, కొన్ని అలవాటు చేసుకోవాలి, మరికొన్ని మానుకోవాలి.. ఇలా బోలెడు లిస్టు రెడీగా ఉంటుంది. కానీ సూర్యుడు పడమరన ఉదయించడం, చంద్రుడు పట్టపగలు కనిపించడం ఎంత అసాధ్యమో మనం రాసుకున్న లిస్టు ఫాలో అవడం కూడా జరగని పని అని చాలామంది ముందే డిసైడ్‌ అయిపోతారు.

ఆ లిస్టులో మీరు కూడా ఉండే ఉంటారు. కొంతమంది మాత్రం పూర్తిగా కాకపోయినా అనుకున్నదాంట్లో ఒక్కటి పూర్తి చేసినా చాలు ఆస్కార్‌ గెలిచినంత సంబరపడిపోతారు. మరికొందరు ఏదో మొక్కుబడిగా కొత్త సంవత్సరం తొలినాడు మాత్రమే ఆచరించి తర్వాత మమ అని వదిలేస్తారు. కొందరు అపసోపాలు పడీ ఆచరిస్తారు. కానీ ఏడాది మొత్తం ముందు అనుకున్న మాటపై నిలబడేవారు చాలా తక్కువ మందే ఉంటారు. ఇంతకీ అసలు కొత్త సంవత్సరం అనగానే మనకొచ్చే కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలేంటో చూద్దాం..

  • మద్యపానం, ధూమపానం, మాంసాహారం మానేయడం
  • క్రమశిక్షణ, సమయపాలన పాటించడం
  • డైరీ రాయడం
  • పెళ్లి చేసుకోవడం
  • ఇల్లు కట్టుకోవడం
  • ఉద్యోగం సంపాదించడం
  • ఏదైనా టూర్‌కి వెళ్లడం
  • ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం
  • సెల్‌ఫోన్‌లో గడిపే సమయాన్ని తగ్గించడం
  • వాహనాలు కొనుగోలు చేయడం
  • బంగారం, ప్లాట్లు కొనుగోలు చేయడం
  • పిల్లల భవిష్యత్తుపై ప్రణాళిక వేసుకోవడం
  • డబ్బు పొదుపు చేయడం
  • సెల్ఫీలు, టిక్‌టాక్‌లు, పబ్జీలకు దూరంగా ఉండాలనుకోవడం
  • ఆలయాలు సందర్శించటం
  • వ్యాయామం చేయడం
  • కొత్త వ్యాపకాలు పెంచుకోవడం..

ఇలా ఎన్నో అనుకుంటూ ఉంటారు. సో, మీరు ఊహల్లోనే గడిపేయకుండా నిజజీవితంలోనూ వాటిని సాధించేందుకు ప్రయత్నం చేయండి. కొన్నింటినైనా జయించండి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top