Love Stories in Telugu - ‘నువ్వు నన్ను మోసం చేసి 8 సంవత్సరాలు’ - Sakshi
Sakshi News home page

‘నువ్వు నన్ను మోసం చేసి 8 సంవత్సరాలు’

Oct 18 2019 3:13 PM | Updated on Oct 30 2019 5:18 PM

Chandra Shekhar Sad Ending Telugu Love Story From Sircilla - Sakshi

నన్ను కొట్టింది నా మరదలే కదా అని నేను...

తొలి ప్రేమను ఎప్పుడూ మర్చిపోరని అంటారు! నా లైఫ్‌లోనూ అలానే జరిగింది. మా మామయ్య కూతురు అంటే నాకు చాలా ఇష్టం. నా చిన్నప్పటినుంచి అందరూ చెబుతూ ఉండేవారు ‘చిట్టి నీ భార్యరా’ అని బహుశా అది నా మైండ్‌లో ఫిక్స్‌ అయిపోయిందనుకుంటా. తనను చూడటానికే వాళ్ల ఇంటికి వెళ్లే వాడిని. కాలేజ్‌ కూడా వాళ్ల ఊరిలోనే జాయిన్‌ అయ్యా. తనని రోజూ చూస్తున్నానని చాలా హ్యాపీగా ఫీలయ్యేవాడిని. ఎలాగైనా తనను పెళ్లి చేసుకోవాలని నా మైండ్‌లో చాలా బలంగా ఫిక్సయ్యాను. ఏ చిన్న జాతరకు వెళ్లినా నా మైండ్‌లో వచ్చే మొదటి ఆలోచన తనకు ఏదో ఒకటి తీసుకోవాలని. మొదటిసారి తనకు గాజులు కానుక ఇవ్వటం నాకు ఇప్పటికీ గుర్తుకు ఉంది.

నీకు గుర్తుకు ఉందో లేదో తెలియదు! నీ బుక్‌ మీద ఏదో చిన్న బొమ్మ గీస్తే నువ్వు నన్ను కొట్టింది. నన్ను కొట్టింది నా మరదలే కదా అని నేను కోప్పడలేదు. కేవలం నీ కోసమే చాలా చిన్న వయస్సులో గల్ఫ్‌కు వెళ్లి చాలా కష్టపడ్డాను. నా మరదలు నన్ను పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండాలని ఎంతో శ్రమించాను. అంత దూరం పోయినా నీ గురించే ఆలోచనలు. నీ వాయిస్ వినకపోతే ఏదోలా అనిపించేది. నువ్వు కూడా నేను ఒక్కరోజు మాట్లాడకపోతే ఏడ్చేదానివి. కానీ, నీ మనసులో వేరే అతను ఉన్నాడన్న విషయం నాకు తెలియలేదు. నేను ఎపుడు కాల్‌ చేసినా ఫోన్‌ బిజీ వస్తే ఎందుకు అని కూడా అడగలేదు. నువ్వంటే నాకు పిచ్చి కాబట్టే ‘నా మరదలు నన్ను మోసం చేయదు’ అన్న గుడ్డి నమ్మకం. నాకు, నీకు పెళ్లి ఓకే చేశారని తెలియగానే ఎంత హ్యాపీగా ఫీలయ్యానో తెలియదు బంగారం. రెండేళ్ల తర్వాత ఇండియాకు వస్తున్నా అని మనసులో హ్యాపీ.

నిన్ను చూస్తానని ఎంతో ఖుషీ. నేను దేశంలో అడుగుపెట్టగానే నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్‌! బాయ్‌ ఫ్రెండ్‌తో వెళ్లిపోవటం. ఆ సమయంలో నా గురించి కొంచెం కూడా ఆలోచించలేదా? నీ గురించి ఎంత ఆలోచించానో నాకు తెలుసు. నువ్వు నన్ను మోసం చేసి 8 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికీ నువ్వు ప్రతిరోజూ గుర్తుకు వస్తావు బంగారం. నిన్ను మరిచిపోలేక​ నేను ఇంకా పెళ్లి చేసుకోకుండా నీ ఆలోచనలలో ఉన్నాను. నువ్వు నీ బాయ్‌ ఫ్రెండ్‌ దగ్గర డబ్బు చూశావు.. మంచి ఇళ్లు చూశావు.. కానీ, లవ్ చూడలేదని అర్థం అవుతోంది. నువ్వు అంత పెద్ద ఇంట్లో ఎలా ఉంటున్నావో నాకు తెలియదు. కానీ, నా చిన్ని ఇంట్లో నువ్వే నా రాణివి బంగారం. 8 సంవత్సరాలనుంచి ఒక్కసారైనా నిన్ను చూడలేదు కానీ నీ రూపం నా కళ్ల ముందు ఎప్పటికి అలానే ఉంటుంది.
- చంద్రశేఖర్‌ (పేర్లు మార్చాం)


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement