అగ్గిపెట్టెతో బాలుడి ఆట.. తగలబడిన ఇళ్లు | house set fire after Boy plays with a match box | Sakshi
Sakshi News home page

అగ్గిపెట్టెతో బాలుడి ఆట.. తగలబడిన ఇళ్లు

Dec 28 2017 3:12 PM | Updated on Sep 5 2018 9:47 PM

house set fire after Boy plays with a match box - Sakshi

విజయవాడ: విజయవాడలోని సింగ్ నగర్లో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అఖిల్ అనే బాలుడు అగ్గిపెట్టితో ఆడుకుంటూ అగ్గిపుల్ల వెలిగించి మంచంపై వేయడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో బాలుడు ఏడుస్తూ గట్టిగా అరిచాడు. ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవడంతో బాలుడి అరుపులు విని స్థానికులు ఇంట్లోకి వెళ్లి అతడిని రక్షించారు. మంటలు ఎక్కువగా వ్యాపించడంతో ఇంట్లోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ఈ ప్రమాదంలో బాలుడి చెవులు, చేతులు, ముఖానికి గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన బాలుడిని ఆసుపత్రుకి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement