వైఎస్‌ఆర్సీపీ నేతపై దౌర్జన్యం, ఉద్రిక్తత | attack on ysrcp ledar in krishna district | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్సీపీ నేతపై దౌర్జన్యం, ఉద్రిక్తత

Jan 25 2018 2:36 PM | Updated on May 29 2018 4:37 PM

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలులో గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది.

సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలులో గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వైఎస్‌ఆర్సీపీ నేత వింత శ్రీనివాసరెడ్డిపై గ్రామ సర్పంచ్ భర్త రాము దౌర్జన్యానికి దిగారు. కారుతో ఢీకొట్టి చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.

సర్పంచ్ భర్త తీరుపై వైఎస్‌ఆర్సీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాము కారు ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. సమచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి ఇరు వర్గాలతో చర్చిస్తున్నారు.  ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement